తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Arunachalam Apsrtc: తిరుపతి - అరుణాచలం మధ్య ఏపీఎస్‌ఆర్టీసీ ఇంద్ర బస్ సర్వీసులు

Arunachalam APSRTC: తిరుపతి - అరుణాచలం మధ్య ఏపీఎస్‌ఆర్టీసీ ఇంద్ర బస్ సర్వీసులు

HT Telugu Desk HT Telugu
Jun 18, 2024 07:46 AM IST

Arunachalam APSRTC: పుణ్యక్షేత్రాలకు సర్వీసుల్లో భాగంగా తిరుప‌తి-అరుణాచ‌లం మ‌ధ్య‌ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ బ‌స్ స‌ర్వీసులు నడుపుతోంది.

అరుణాచలం టూర్ కు ఆర్టీసీ బస్సులు
అరుణాచలం టూర్ కు ఆర్టీసీ బస్సులు

Arunachalam APSRTC: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్య‌క్షేత్రాల‌కు బ‌స్ స‌ర్వీసుల‌ను కొత్త‌గా వేసింది. రాష్ట్రంలోని తిరుప‌తి నుంచి త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై)కి ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ బ‌స్ స‌ర్వీస్‌ల‌ను తీసుకొచ్చింది. తిరుప‌తి నుంచి అరుణాచ‌లంకి మ‌ధ్య రెండు ప‌ట్ట‌ణాల‌ను మీదుగా ఈ స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లే వారికి మ‌రింత సౌక‌ర్యం కానునుంది. తిరుప‌తి-తిరువ‌ణ్ణామ‌లై న‌గ‌రాల మ‌ధ్య ఇంద్ర ఎసీ బ‌స్సుల‌తో ప్ర‌యాణం మ‌రింత సుల‌భ‌త‌రం, సుఖ‌వంతం అవుతుంద‌ని ఆర్టీసీ తెలిపింది.

తీర్థ యాత్ర‌లు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ స‌ర్వీసులు ప్రారంభించింది. తీర్థ‌యాత్ర‌లు చేసేవారికి సౌకర్యంగా ఉండేందుకు తిరుపతి నుంచి అరుణాచ‌లంకి ఇంద్ర ఏసీ బ‌స్ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ వారిచే న‌డిచే ఈ బ‌స్ స‌ర్వీస్ ఏపీలోని తిరుప‌తిలో బ‌య‌లుదేరి, చిత్తూరు, వేలూరు మీదుగా అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై) చేరుకుంటుంది.

ఈ ప‌ట్ట‌ణాల‌న్నీ పుణ్య క్షేత్రాలే. తిరుప‌తిలో ద‌ర్శ‌నం చేసుకుని బ‌య‌లు దేరిన యాత్రికులు అరుణాచ‌లంలోని ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. తిరుప‌తి నుంచి అరుణాచ‌లానికి రెండు స‌ర్వీసులు, తిరిగి అరుణాచ‌లం నుంచి తిరుప‌తికి మ‌రో రెండు స‌ర్వీసులు మొత్తం రెండు వైపులు నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

తిరుప‌తిలో ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఇంద్ర ఏసీ బ‌స్ (స‌ర్వీస్ నెంబ‌ర్ 4524) ప్రారంభం అవుతుంది. రెండో స‌ర్వీస్ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఇంద్ర ఏసీ బ‌స్ (స‌ర్వీస్ నెంబ‌ర్ 4600) ప్రారంభం అవుతుంది. అరుణాచ‌లంలో మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ఇంద్ర ఏసీ బ‌స్ (స‌ర్వీస్ నెంబ‌ర్ 4525) ప్రారంభం అవుతుంది. రెండో స‌ర్వీస్ రాత్రి 11.00 గంట‌ల‌��ు ఇంద్ర ఏసీ బ‌స్ (స‌ర్వీస్ నెంబ‌ర్ 4601) ప్రారంభం అవుతుంది.

ఈ బ‌స్ స‌ర్వీస్‌ టిక్కెట్టును https://www.apsrtconline.inలో బుక్ చేసుకోవ‌డానికి అందుబాటులో ఉంది. టిక్కెట్టు ధర పెద్దలకు రూ.490, పిల్లలకు రూ.390గా ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రానుపోను టిక్కెట్లు ఒకేసారి బుకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీ అవ‌కాశం ఏపీఎస్ఆర్టీసీ క‌ల్పిస్తుంది.

( రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel