తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Akasa Air Pay Day Sale : విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి!

Akasa Air Pay Day sale : విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి!

Sharath Chitturi HT Telugu
Jun 30, 2024 09:35 AM IST

Discounts on flight tickets : ‘పే డే సేల్​’ని ప్రకటించింది ఆకాశా ఎయిర్​. ఇప్పుడు.. భారీ డిస్కౌంట్లతో మీరు విమాన టికెట్లను బుక్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

ఆకాశా పే డే సేల్​ వివరాలు..
ఆకాశా పే డే సేల్​ వివరాలు.. (REUTERS)

తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి గుడ్​ న్యూస్​! ఆకాశ ఎయిర్​ సంస్థ, తమ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. 'పే డే సేల్'లో భాగంగా ఈ డిస్కౌంట్లను ఇస్తోంది సంస్థ. ఇప్పటికే మొదలైన ఈ సేల్​.. జులై 1, అంటే సోమవారం వరకు కొనసాగనుంది. త్వరపడితే, మీరు చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

ఆకాశా ఎయిర్​ పే డే సేల్​లో ఎలా డిస్కౌంట్లు పొందాలి?

పే డే సేల్​లో భాగంగా డొమెస్టిక్​ ట్రావెల్స్​పై 20శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది ఆకాశా ఎయిర్​. ఈ సంస్థకు చెందిన వెబ్​సైట్​, మొబైల్​ యాప్​ లేదా ట్రావెల్​ ఎజెంట్స్​ దగ్గర 'పేడే' ప్రోమో కోడ్​ వాడి సేవర్​, ఫ్లెక్సీ ఫేర్లకు డిస్కౌంట్లు పొందొచ్చు.

"ఆకాశా ఎయిర్​కి చెందిన డొమెస్టిక్​ నెట్​వర్క్​లోని 22 గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు కస్టమర్లు సేవర్​, ఫ్లెక్సీ ఛార్జీలపై 20శాతం వరకు డిస్కౌంట్లు పొందొచ్చు. www.akasaair.com, మొబైల్​ యాప్​, ట్రావెల్​ ఏజెంట్​ దగ్గర ఈ నెల 28 నుంచి జులై 1 వరకు ఈ ఆఫర్​ పనిచేస్తుంది," అని సంస్థ ఒక ���్రకటనను విడుదల చేసింది.

అయితే.. ఇది కేవలం డొమెస్టిక్​ ఫ్లైట్స్​కి మాత్రమే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా 2024 జులై 5 నుంచి సెప్టెంబర్​ 30 వరకు చేసే ట్రావెల్స్​కే వర్తిస్తుంది. అయితే.. ఆగస్ట్​ 15, ఆగస్ట్​ 19, సెప్టెంబర్ 4, సెప్టెంబర్​ 7 వంటి కొన్ని ఎంపిక చేసిన డేట్స్​లో ఈ డిస్కౌంట్లు ఉండవు అని గుర్తించాలి.

పే డే సేల్​ని సంస్థ ప్రకటించినప్పటికీ.. ఇందులో పలు టర్మ్స్​ అండ్​ కండీషన్స్​ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అడల్ట్​, చైల్డ్​ కేటగిరీ వారికే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఆర్మీ సిబ్బంది, డాక్టర్లు, స్టూడెంట్స్​, వృద్ధులకు ఇది వర్తించదు. మీల్​ ఛార్జీలు, ఎక్సెస్​ బ్యాగేజ్​ ఛార్జీలు, ఎయిర్​పోర్ట్​ ఛార్జీలు, ప్రభుత్వ ఛార్జీలకు ఈ డిస్కౌంట్​ వర్తించదు. ఇతర ప్రోమో కోడ్స్​, ఆఫర్స్​తో ఈ డిస్కౌంట్లను జతచేయలేము. గ్రూప్​ బుకింగ్స్​ అస్సలు చేసుకోలేము.

ఆకాశా ఎయిర్​ సేవలు..

మరోవైపు.. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు నూతన ప్రాడక్ట్స్​ని తీసుకొచ్చినట్టు ఆకాశా ఎయిర్​ తెలిపింది. తాము వాడుతున్న బోయింగ్​ 373 మ్యాక్స్​ విమానాల్లో ప్రయాణికులకు మంచి లెగ్​ రూమ్​, పరికరాల ఛార్జింగ్​ కోసం యూఎస్​బీ పోర్ట్​ వంటివి ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

ఇక అప్డేట్​ చేసిన కెఫే ఆకాశా మెన్యూలో 45 మీల్​ ఆప్షన్స్​ ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇందులో.. హెల్తీ మీల్​, ఫెస్టివల్​ ఫేవరెట్స్​, గౌర్మెట్​, ఫ్యూషన్​ డిషెస్​ వంటివి కూడా ఉన్నాయి.

ఇతర విషయాలకు వస్తే.. ముంబై నుంచి అబుదాబికి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించినట్టు ఆకాశా ఎయిర్​ ప్రకటించింది. ఈ విమాన సేవలు జులై 11న ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. సంస్థకు చెందిన అంతర్జాతీయ సేవ లిస్ట్​లో అబుదాబి నాలుగోది. దోహా, జెడ్డాహ్​, రియాద్​లకు ఇప్పటికే విమానాలను నడుపుతోంది. కువైట్​, మెదీనా ట్రాఫిక్​ రైట్స్​ సైతం ఈ సంస్థ వద్ద ఉన్నాయి.

2022 ఆగస్టులో ఆకాశా ఎయిర్​ తన కార్యకలాపాలను ప్రారంభించింది.

WhatsApp channel

సంబంధిత కథనం