తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. రోడ్లపై ట్రాఫిక్​ ఆంక్షలు- మండిపడుతున్న ప్రజలు!

Ambani wedding : అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. రోడ్లపై ట్రాఫిక్​ ఆంక్షలు- మండిపడుతున్న ప్రజలు!

Sharath Chitturi HT Telugu
Jul 07, 2024 12:05 PM IST

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు ముందు ముంబై పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ వ్యవహారంపై ప్రజలు మండిపడుతున్నారు.

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. ముంబైలో భారీ ఆంక్షలు!
అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. ముంబైలో భారీ ఆంక్షలు!

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంగీత్​కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కాగా, అంబానీ ఇంట పెళ్���ి వేడుకల నేపథ్యంలో ముంబై పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. జూలై 12 నుంచి 15 వరకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో బీకేసీ, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో నగరంలోని ప్రధాన మార్గాల్లో ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో దారి మళ్లింపులకు సంబంధించి ముంబై ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ చేశారు.

"2024 జూలై 5తో పాటు 12 నుంచి 15 వరకు ముంబైలోని బాంద్రా(ఈ) బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్​లో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. అసౌకర్యాన్ని నివారించడానికి, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను దారి మళ్లించాల్సిన అవసరం ఉంది," అని ముంబై పోలీసులు ఇటీవలే విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్​ల వివాహం దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది. రిహానా, జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్​ ప్రముఖలతో పాటు దాదాపు అందరు బాలీవుడ్ ప్రముఖులు, గాయకులు ఫంక్షన్లలో పాల్గొంటున్నారు.

అయితే ఈ కార్యక్రమం కోసం మూడు రోజుల పాటు ప్రయాణ ఆంక్షలు విధించడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం సోషల్​ మీడియాలో హాట్​టాపిక్​గా మారింది. ఒక ప్రైవేట్​ ఈవెంట్​ కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

"ఒక పారిశ్రామికవేత్త వ్యక్తిగత కార్యక్రమం పబ్లిక్ ఈవెంట్​గా ఎప్పుడు మారింది? ముంబైలోని ప్రతి పౌరుడిని దీనికి ఆహ్వానిస్తారా? లేదా ఎంపిక చేసిన కొద్దిమందిని ఆహ్వానిస్తారా? సాధారణ ప్రజలను అసౌకర్యానికి గురిచేయడానికి బదులు, దీనిని రాత్రికి రీషెడ్యూల్ చేయమని నిర్వాహకులకు చెప్పి ఉండాల్సింది," అని ముంబై పోలీసు విభాగం షేర్ చేసిన పోస్ట్​పై ఒక ఎక్స్ యూజర్ వ్యాఖ్యానించారు.

'అనంత్ అంబానీ పెళ్లి పబ్లిక్ ఈవెంట్ ??? ఏదో ఒక పెళ్లికి సాధారణ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు,' అని మరో నెటిజన్ ప్రశ్నించారు.

"ప్రభుత్వం ప్రైవేట్ ఈవెంట్​లో పాల్గొనడం ఎప్పుడు మొదలుపెట్టింది?" అని మరొక యూజర్ ప్రశ్నించాడు.

"రోడ్ల మీద ఆంక్షలు విధించడం ఎందుకు? ఏకంగా పబ్లిక్​ హాలీడే ఇచ్చేయండి," అని మరొకర సెటైర్​ వేశారు.

'హాథ్రస్ భోలే బాబా ఈవెంట్ కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.

“పెళ్లి పబ్లిక్ ఈవెంట్ లేదా ప్రైవేట్ ఈవెంట్??” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

"ధనవంతులు జీవితాన్ని ఆశ్వాదిస్తుంటే, సామాన్యుడు, రోజువారీ తిండి కోసం పోరాడేవారు కష్టపడుతున్నారు," అని మరొక యూజర్​ తెలిపారు.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ప్రధాన వేడుకలు జూలై 12, శుక్రవారం శుభ వివాహ వేడుకతో ప్రారంభమవుతాయి. జూలై 13వ తేదీ శనివారం శుభ్ ఆశీర్వాద్​తో వేడుకలు కొనసాగుతాయి. చివరి కార్యక్రమం, మంగళ్ ఉత్సవ్/ వెడ్డింగ్ రిసెప్షన్ జూలై 14, ఆదివారం జరగనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం