తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pune Porsche Crash : పూణె పోర్షే కేసు నిందితుడి తల్లి అరెస్ట్​- కొడుకు కోసం..

Pune Porsche crash : పూణె పోర్షే కేసు నిందితుడి తల్లి అరెస్ట్​- కొడుకు కోసం..

Sharath Chitturi HT Telugu
Jun 01, 2024 08:45 AM IST

పూణె పోర్షే కేసు నిందితుడి తల్లిని పోలీసులు తాజాగా అరెస్ట్​ చేశారు. నిందితుడు, అతని తండ్రి, అతని తాతతో పాటు ఇప్పుడు మైనర్​ తల్లి కూడా జైలుకు వెళ్లారు!

పూణె పోర్షే కేసు నిందితుడి తల్లి అరెస్ట్​
పూణె పోర్షే కేసు నిందితుడి తల్లి అరెస్ట్​

Porsche accident Pune latest updates : యావత్​ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసిన పూణె పోర్షే కేసులో మరో కీలక అప్డేట్​. మద్యం మత్తులో లగ్జరీ వాహనాన్ని అత్యంత వేగంగా నడిపి, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్​ తల్లిని పోలీసులు తాజాగా అరెస్ట్​ చేశారు. కుమారుడి బ్లడ్​ శాంపిల్స్​ మార్చేసి, అతడిని ఇంతటి ఘోరమైన నేరం నుంచి తప్పించేందుకు ఆమె ప్రయత్నించిందని పోలీసులు ఆరోపించారు.

పుణె పోర్షే కేసు అప్డేట్​..

పూణె పోర్షే కేసుకు సంబంధించి.. ఇప్పటికే నిందితుడు, అతని తండ్రి- ప్రముఖ రియాల్టర్​ విశాల్​ అగర్వాల్​, అతని తాత జైలులో ఉన్నారు. ఇప్పుడు తల్లి కూడా అరెస్ట్​ అవ్వడంతో.. మైనర్​ కుటుంబంలోని మొత్తం నలుగురు జైలుకు వెళ్లినట్టు అయ్యింది!

Pune Porsche case update : పూణె కళ్యాణి నగర్​లో మే 19న.. ఈ ఘటన జరిగింది. నిందితుడు.. ఇంటర్​ పరీక్ష పాసైనందుకు తన ఫ్రెండ్స్​తో కలిసి పబ్​కి వెళ్లి పార్టీ చేసుకున్నాడు. వాస్తవానికి 17ఏళ్ల బాలుడికి పబ్​లో ఎంట్రీ ఉండదు. మద్యం కూడా ఇవ్వకూడదు. కానీ ఆ మైనర్​.. మద్యం సేవించి, బయటకు వచ్చి.. డ్రైవర్​ని పక్కన కూర్చోబెట్టి అత్యంత వేగంగా పోర్షే కారు నడిపాడు. కళ్యాణి ప్రాంతంలో బైక్​ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. పోలీసులు నిందితుడిని అప్పుడే అరెస్ట్​ చేశారు. కానీ తొలుత అతడికి 15 గంటల్లోనే బెయిల్​ లభించింది. పైగా.. యాక్సిడెంట్ల మీద వ్యాసాలు రాయాలంటూ బెయిల్​ ఇవ్వడం సర్వత్రా చర్చకు దారి తీసింది. చివరికి.. ఇది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పూణె ప్రజలు తీవ్రస్థాయిల నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా.. ఈ కేసుపై పోలీసులు వేగంగా పావులు కదపడం మొదలుపెట్టారు.

Pune Porsche case accused mother arrested : దర్యాప్తులో భాగంగా.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. మైనర్​కి బండి ఇచ్చిన అతని తండ్రిని కూడా అరెస్ట్​ చేశారు. నేరాన్ని తన మీద మోపేందుకు ప్రయత్నిస్తున్నారని డ్రైవర్​ ఆరోపించడంతో.. ఆ మైనర్​ తాతను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇక ఘటన జరిగిన రాత్రి.. పోలీసులు నిందితుడిని పోలీస్​ స్టేషన్​కి తీసుకెళ్లినప్పటికీ.. బ్లడ్​ శాంపిల్​ని చాలా ఆలస్యంగా సేకరించారని తొలుత సమాచారం వచ్చింది. పిజ్జాలు తినిపించి, రక్తంలో మద్యం నమూనాలను తొలగించాలని చూసినట్టు వార్తలు వచ్చాయి. చివరికి.. బ్లడ్​ శాంపిల్​లో మద్యం రిపోర్టు నెగిటివ్​గా వచ్చింది! ఇదెలా సాధ్యం? అని సీనియర్​ అధికారులు దర్యాప్తు చేస్తుండగా.. పలు షాకింగ్​ విషయాలు వెలువడ్డాయి. బ్లడ్​ శాంపిల్​ సేకరించిన ఆసుపత్రిలో కొందరు వైద్యులు.. దానిని మార్చేశారని తేలింది. వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Pune Porsche case : చివరికి.. ఆ బ్లడ్​ శాంపిల్​ మైనర్​ తల్లిదని తేలింది. ఫలితంగా.. కొడుకును రక్షించేందుకు ఆమె కుట్రకు పాల్పడటంతో.. మైనర్​ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం