ఉగాది 2024


ఉగాది రోజునే తెలుగు నూతన సంవత్సరం. అంటే ఇదే మొదటి పండగ. ఉగాది అంటే నక్షత్ర గమనానికి ఆది అని, జన్మ, ఆయుష్షులకు ఆది అని, అందుకే ఉగాది అయిందని విశ్వాసం. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ దేవుడి ఈ విశ్వాన్ని సృష్టించిన కారణంగా అది ఉగాది అయిందని మరో నమ్మకం. 2024 తెలుగు సంవత్సరం పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాల పేర్లు మొత్తం 60. క్రోధి నామ సంవత్సరం క్రమ సంఖ్య 38. క్రోధి నామ సంవత్సరం అంటే కోపాన్ని కలిగినది. క్రోధ స్వభావం కలిగినదని అర్థం.

ఉగాది తేదీ 9 ఏప్రిల్ 2024, మంగళవారం

...

ఉగాది కథనాలు

కేసరి హల్వా
Kesari Halwa Recipe : ఈ పండుగ రోజున రుచికరమైన కేసరి హల్వా చేసేయండి

Tuesday, April 9, 2024

క్రోధి నామ సంవత్సర ఫలితాలు
Krodhi nama samvatsram: క్రోధి నామ సంవత్సర ఫలితాలు.. ఏ గ్రహాలు ఎలాంటి పరిస్థితులు కలిగిస్తాయో చూద్దాం

Tuesday, April 9, 2024

ఉగాది పండుగ 2024
Ugadi 2024: ఉగాది పండుగ తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Tuesday, April 9, 2024

ఉగాది పచ్చడి రెసిపీ
Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి సంప్రదాయ పద్ధతిలో ఇలా చేసుకుని తినండి, ఎంతో శుభం

Monday, April 8, 2024

గుడి పడ్వా గురించి ఆసక్తికర విషయాలు
Gudi padwa 2024: ఉగాదిగా జరుపుకునే గుడి పడ్వా వేడుకల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

Monday, April 8, 2024

ఉగాది శుభాకాంక్షలు
Ugadi Wishes 2024: ఉగాది పండుగకు బంధుమిత్రులకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Monday, April 8, 2024

ఉగాద��� పండుగ
Ugadi 2024: ఉగాది పండుగ నాడు ఈ పనులు చేస్తే మీకు ఏడాదంతా శుభమే, చేయకూడని పనులు కూడా ఇదిగో

Monday, April 8, 2024

తిరుమలలో ఉగాది ఆస్థానం
Tirumala Ugadi Asthanam : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్-ఈ నెల 9న ఉగాది ఆస్థానం, పలు ఆర్జిత సేవలు రద్దు

Sunday, April 7, 2024

ఉగాది రాశి ఫలాలు

Header Logo
09 ఏప్రిల్ 2024శ్రీ క్రోధి నామ సంవత్సరం
పూర్తి పంచాంగం

ఉగాది వంటకాలు

ఉగాది 2024

లేటెస్ట్ ఫోటోలు

<p>ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా గుడి పడ్వాను ఘనంగా నిర్వహించుకున్నారు. &nbsp;మరాఠీల నూతన సంవత్సరం గుడిపడ్వా. ఈ పండుగ రోజున &nbsp;సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు ఊరేగింపుగా నృత్యం చేస్తారు.</p>

Gudipadwa 2024 : కనుల పండువగా గుడి పడ్వా ఉత్సవాలు, ఫోటోలపై ఓ లుక్కేయండి

Apr 09, 2024, 05:07 PM

Latest Videos

solar eclipse

Solar Eclipse April 8 | ఉగాది ముందు రోజే అతిపెద్ద సూర్యగ్రహణం.. ఏ రాశి వారిపై ప్రభావం ఎక్కువంటే?

Apr 04, 2024, 01:44 PM

తాజా వెబ్ స్టోరీలు

ఉగాది రోజున తెలుగు వారంతా కొత్తగా పనులు ప్రారంభిస్తారు. తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు అనే ఆరు రకాల రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. మంచి చెడులు, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశానికి ఇది ప్రతీక. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఇదే రోజు మహారాష్ట్ర ప్రజలు గుడిపాడ్వాగా జరుపుకుంటారు. సిక్కులు వైశాఖీగా, కేరళ ప్రజలు విషు పండగగా జరుపుకుంటారు. ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. హిందూ నూతన సంవత్సరంలో కాలం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. తమ భవిష్యత్తు గురించి రాశి ఫలాలు,పంచాంగం, జాతకం ద్వారా తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. పంచాంగ శ్రవణం ద్వారానే రైతులు గిట్టుబాటయ్యే పంటలు వేసుకుంటారు. వర్షపాతం అంచనాలు తెలుసుకుంటారు.

FAQ:

జవాబు: శ్రీ క్రోధి నామ సంవత్సరం
+
జవాబు: తెలుగు నూతన సంవత్సరంలో కాలం ఎలా ఉండబోతోంది? వర్షాలు ఎలా కురుస్తాయి? ఏ పంటలు ఎక్కువ పండుతాయి? వేటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఉండే ఘర్షణలు, ధరల పెరుగుదల, వాణిజ్యం వంటి వాటిలో భవిష్యత్తును సూచిస్తుంది. అందుకే పంచాంగ శ్రవణం చేయడం మంచిది.
+
జవాబు: ఉగాది రోజు మంచి రోజు. కొత్త పనులు ప్రారంభించే రోజు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, తల స్నానం చేసి, ఉతికిన దుస్తులు ధరించాలి. దేవుడికి పూజచేయాలి. ఉగాది పచ్చడి చేయాలి. దానిని సేవించి బంధు మిత్రులకు పంచాలి. ఉగాది పంచాంగం వినాలి. రాశి ఫలాలు తెలుసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించాలి.
+
జవాబు: ఉగాది పచ్చడి షడ్రచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇలా ఆరు రకాల రుచులను ఇచ్చే పదార్థాలను కలిపి తయారు చేస్తారు.
+
జవాబు: ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోధారి, రక్తిక్షి, క్రోధన, అక్షయ
+
జవాబు: క్రోధి నామ సంవత్సరం అంటే కోపాన్ని కలిగినది. క్రోధ స్వభావం కలిగినదని అర్థం.
+