HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే

Today Gold Rate : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే

Anand Sai HT Telugu

03 July 2024, 5:40 IST

    • Gold Rate Today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
పెరిగిన బంగారం ధరలు
పెరిగిన బంగారం ధరలు

పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 66,360 చేరింది. మంగళవరాం ఈ ధర రూ. 66,350గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 6,63,600 ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,636గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Gold and silver prices today : జులై 16 : పసిడి, వెండి ధరలు పెరిగాయా? ఇక్కడ చెక్​ చేసుకోండి..

OnePlus Phone Discount : రూ.14వేల డిస్కౌంట్‌తో వన్ ప్లస్ ఫోన్.. అరగంటలో ఛార్జింగ్.. ఇయర్ బడ్స్ ఫ్రీ!

Xiaomi Phone Discount : రూ.10 వేల డిస్కౌంట్‌తో షావోమి ఫోన్.. వావ్ అనిపించే కెమెరా ఫీచర్లు

Stock Market : ఏడాది కిందట ఈ షేరు ధర రూ.5 మాత్రమే.. ఇప్పుడు రూ.57.. నెల రోజుల్లో 8 శాతం పెరుగుదల

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 72,390గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,380గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 72,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,239గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,510.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,540గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,360 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,390గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.కాగా.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,910గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,990గా ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,360గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,390గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,410గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,440గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,360గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,390గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9110గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 91100గా కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ. 91,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 95,600 పలుకుతోంది. వంద గ్రాముల వెండి ధర రూ.9560గా నడుస్తోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91100.. బెంగళూరులో రూ. 89950గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు పడిపోయాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర 370 రూపాయలు తగ్గి.. రూ. 26,200గా ఉంది. క్రితం రోజు కంటే 370 రూపాయలు తగ్గింది.

హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,200గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

తదుపరి వ్యాసం