HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.

Telugu News

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్

TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్

11:06 PM IST

  • TG DSC Schedule : తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు రోజుకు రెండు షిప్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన- రాగల రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

09:52 PM IST

  • AP Rains : ద్రోణి, నైరుతి రుతుపవనాల విస్తరణలో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు.

USA News: స్కాలర్ షిప్ కోసం తండ్రి చనిపోయాడని అబద్ధం; భారత్ పంపించేసిన యూఎస్ యూనివర్సిటీ

09:11 PM IST

  • అబద్ధపు పునాదులపై అందమైన భవిష్యత్తును నిర్మించుకుందామనుకున్నాడు. తండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి అమెరికాలో మంచి కాలేజీలో స్కాలర్ షిప్ తో అడ్మిషన్ సంపాదించాడు. కానీ మనస్సాక్షి అంగీకరించక రెడిట్ పోస్ట్ లో నిజం చెప్పేశాడు. వాస్తవం బయటపడి, బహిష్కరణ వేటు పడి, ప్రస్తుతం భారత్ తిరిగి వస్తున్నాడు.

Amarnath Yatra: కశ్మీర్ లోయకు చేరుకున్న తొలి బ్యాచ్ అమర్ నాథ్ యాత్రికులు

08:13 PM IST

2024 సంవత్సర అమర్ నాథ్ యాత్రకు సిద్ధమైన తొలి బ్యాచ్ భక్తులు శుక్రవారం కశ్మీర్ లోయకు చేరుకున్నారు. వారికి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా స్వాగతం పలికారు. ఈ బ్యాచ్ లో మొత్తం 4,600 మంది యాత్రికులు ఉన్నారు. అమర్ నాథ్ భక్తులకు ముస్లింలు సహా స్థానికులు ఆదరంగా స్వాగతం పలకడం విశేషం.

Actor Ali Resigns To Ysrcp : వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా- రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్

08:53 PM IST

  • Actor Ali Resigns To Ysrcp : సినీ నటుడు అలీ రాజకీయాలు గుడ్ బై చెప్పారు. ఇకపై తాను ఏ పార్టీ మనిషి కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు.

Shadnagar Fire Accident : షాద్ నగర్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు, ఆరుగురు మృతి

07:45 PM IST

  • Shadnagar Fire Accident : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. స్థానిక గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.  

CM Revanth Reddy : పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ, రేషన్ కార్డు ప్రామాణికం కాదు- సీఎం రేవంత్ రెడ్డి

08:09 PM IST

  • CM Revanth Reddy : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.

ITR filing 2024: ఆదాయపన్ను రిటర్న్స్ ఫైలింగ్ లో ఎవరు ఏ ఐటీఆర్ ఫామ్ ను ఎంచుకోవాలి?

06:37 PM IST

ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతీ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించడం ఒక చట్టబద్ధ విధి. అందువల్ల ఐటీ పరిధిలోకి వచ్చే వారు వారి ఆదాయ వనరులను బట్టి ఐటీఆర్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఐటీఆర్ లను ఫైల్ చేయడానికి జులై 31 లాస్ట్ డేట్. అందువల్ల, ఎవరు ఏ ఐటీఆర్ ఫామ్ ను ఫైల్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

HDFC Bank: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందా? ఈ మార్పులు గమనించండి.. లేదంటే బాదుడే..

05:50 PM IST

ఆగస్టు 1, 2024 నుండి హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ఆగస్ట్ 1 నుంచి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ ల ద్వారా జరిపే చెల్లింపులపై చార్జీలు వర్తించనున్నాయి. మీకు వర్తించే నిర్దిష్ట ఛార్జీల గురించి తెలుసుకోవడానికి హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ వెబ్ సైట్ ను సందర్శించండి.

Delhi rains: ఒక్క రోజు వర్షానికే నీట మునిగిన దేశ రాజధాని నగరం; పార్లమెంటుకు వెళ్లడానికి పడవ కావాలన్న ఎంపీ

05:18 PM IST

Delhi rains: గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో అల్లాడిన దేశ రాజధాని నగరం ఢిల్లీని గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్ఢు స్థాయిలో 228.1 ఎంఎం వర్షపాతం నమోదైంది.

APPSC DEO Prelims Results : ఏపీపీఎస్సీ డీఈవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్స్ కు 3,957 మంది ఎంపిక

06:28 PM IST

  • APPSC DEO Prelims Results : ఏపీపీఎస్సీ డీఈవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది.

CM Chandrababu : జగన్ ప్రమాణ స్వీకారం రోజే పనులు ఆపేశారు, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

04:44 PM IST

  • CM Chandrababu On Polavaram : సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. 2019 నుంచి 2024 మే వరకు జరిగిన పోలవరం పురోగతి, ఖర్చు వివరించిన సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు.

AP Universities VC Resigns : ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్

05:27 PM IST

  • AP Universities VC Resigns : ఏపీ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. వీరిపై వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

Tata Nexon vs Kia Sonet: టాటా నెక్సాన్ వర్సెస్ కియా సోనెట్: ఈ రెండింటిలో ఏది కొనడం మంచిది?

04:17 PM IST

  • సబ్ కంపాక్ట్ ఎస్ యూ వీ కేటగిరీలో మార్కెట్లో అగ్ర స్థానంలో ఉన్నవి కియా సోనెట్, టాటా నెక్సాన్. ఈ రెండు ఎస్ యూవీలు వినియోగదారుల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. వీటిలో సోనెట్ ధర (ఎక్స్ షో రూమ్) రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా నెక్సాన్ ధర (ఎక్స్ షో రూమ్) రూ. 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Chevella MLA Yadaiah : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!

03:35 PM IST

  • Chevella MLA Yadaiah Joined Congress : చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. దీంతో కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.

Guntur District : ఫొటోల పేరుతో యువ‌తిపై లైంగిక దాడి - నిందితుడికి ప‌దేళ్ల జైలు శిక్ష‌

05:14 PM IST

  • Guntur District Crime News : యువతిపై లైంగిక దాడిలో కేసులో గుంటూరులోని కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.

Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్; జైలు నుంచి విడుదల కానున్న జేఎంఎం నేత

03:31 PM IST

Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది. జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్నారు.

Yash on Prabhas Kalki: డార్లింగ్‌ను చూస్తుంటే అద్భుతంగా అనిపించింది: కల్కి 2898 ఏడీపై కేజీఎఫ్ స్టార్ ప్రశంసల వర్షం

04:22 PM IST

  • Yash on Prabhas Kalki: కల్కి 2898 ఏడీ మూవీపై కేజీఎఫ్ మూవీ స్టార్ యశ్ ప్రశంసల వర్షం కురిపించాడు. డార్లింగ్ ప్రభాస్ తోపాటు ఇతర నటీనటులందరినీ స్క్రీన్ పై చూడటం చాలా అద్భుతంగా అనిపించిందని అతడు అన్నాడు.

TG SSC Supplementary Results 2024 : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్ తో చెక్ చేసుకోండి

03:09 PM IST

  • TG SSC Advanced Supplementary Results 2024 : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. SSC బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

OTT News: యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

03:50 PM IST

  • OTT News: యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటి త‌ృప్తి దిమ్రి నటిస్తున్న మూవీ బ్యాడ్ న్యూస్. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రైమ్ వీడియో చేతికి దక్కాయి.

జూన్ 29, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి

12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.06.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Sircilla Crime : సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్

10:40 PM IST

  • Sircilla Crime : నర్సింగ్ కోర్సు చేస్తు్న్న విద్యార్థులు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి చాకెట్లు విక్రయిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా పోలీసులు గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు చేశారు.

Kalki 2898 AD day 2 box office collections: రెండో రోజు 50 శాతం వరకు పడిపోయిన కల్కి 2898 ఏడీ కలెక్షన్లు.. కారణం అదేనా?

10:37 PM IST

  • Kalki 2898 AD day 2 box office collections: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు రెండో రోజు అనూహ్యంగా 50 శాతం వరకు పడిపోవడం గమనార్హం. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం తగ్గాయి.

Sonakshi Sinha Wedding: సోనాక్షి పెళ్లి జరిగిన ఐదు రోజులకే హాస్పిటల్లో చేరిన తండ్రి శతృఘన్ సిన్హా

10:14 PM IST

  • Sonakshi Sinha Wedding: సోనాక్షి సిన్హా పెళ్లి జరిగిన ఐదు రోజులకే ఆమె తండ్రి శతృఘన్ సిన్హా హాస్పిటల్లో చేరాడు. దీంతో కూతురు, అల్లుడు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు.

TPCC New Chief : టీపీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ, ఆయనకే ఖరారంటూ లీకులు!

10:11 PM IST

  • TPCC New Chief : టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుంది. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకం కానుందని సమచారం. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని తెలుస్తోంది.

Netflix Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

09:41 PM IST

  • Netflix Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం (జూన్ 28) తమ సోషల్ మీడియా ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది.

Rohit vs Inzamam: కాస్త బ్రెయిన్ వాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు క్లాస్ పీకిన రోహిత్.. అతని రియాక్షన్ ఇదీ

09:07 PM IST

  • Rohit vs Inzamam: కాస్త బ్రెయిన్ వాడు అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ పీకాడు. దీనిపై ఆ మాజీ క్రికెటర్ ఇంజమామ్ కూడా ఘాటుగానే స్పందించాడు.

జూన్ 29, రేపటి రాశి ఫలాలు.. రేపు శనివారం ఆర్థిక సంక్షోభం ఎవరికి ఎదురవుతుంది?

08:20 PM IST

  • Tomorrow rasi phalalu: రేపు ఎలా ఉండబోతుంది? అదృష్టం వల్ల ఎవరికి సహాయం అందుతుంది? రేపటి జాతకాన్ని తెలుసుకోండి.  

Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నాడో చూడండి

08:12 PM IST

  • Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? ఇదే ప్రశ్నకు ఆమె భర్త విక్కీ కౌశల్ కాస్త డిఫరెంట్ గా సమాధానమిచ్చాడు. తన లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విక్కీ దీనిపై స్పందించాడు.

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

07:51 PM IST

Delhi Airport pics: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లోని టెర్మినల్ 1లోని డిపార్చర్ ఏరియాలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలింది. సపోర్టింగ్ బీమ్స్ కూడా కూలిపోయాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయాలపాలయ్యారు.

Mercury transit: రేపటి నుంచి ఈ రాశుల వారికి శుభ దినాలు.. బుధుడి అనుగ్రహంతో తలరాతలు మారబోతున్నాయ్

07:21 PM IST

  • Mercury transit: జూన్ 29 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించి కొ��్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. రేపటి నుంచి ఎవరికి మంచి రోజులు మొదలవుతాయో చూసేయండి. 

Curry leaves for hair: కరివేపాకును ఇలా వాడారంటే..ఎలాంటి జుట్టు సమస్య అయినా తగ్గిపోతుంది..

07:07 PM IST

Curry leaves for hair: కరివేపాకును ఉపయోగించడం ద్వారా జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గించుకోవచ్చు. దానికోసం కరివేపాకును ఎలా వాడాలో తెల్సుకోండి.