తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Netflix Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Jun 28, 2024 09:41 PM IST

Netflix Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం (జూన్ 28) తమ సోషల్ మీడియా ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Netflix Comedy Web Series: క్రైమ్ థ్రిల్లర్ తోపాటు ఎన్నో జానర్ల వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఇప్పుడు ఓ కామెడీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్. ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (జూన్ 28) తమ సోషల్ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేయడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్

మానవ్ కౌల్, తిలోత్తమ షోమ్ నటిస్తున్న కామెడీ వెబ్ సిరీస్ ఈ త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్. నెట్‌ఫ్లిక్స్ లో జులై 18 నుంచి ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "మీ జీవితంలో అయినా, అకౌంట్లలో అయినా అసమతుల్యత ఉంటే ఈ సీఏ టార్ సర్వీసులు తీసుకోండి. అది మీ రిస్క్ పైనే. ఎందుకంటే ఇతని డబుల్ జీవితం డబుల్ ట్రబుల్ తో పాటు వచ్చింది. త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ నెట్‌ఫ్లిక్స్ లో జులై 18న రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది.

ఓ సాధారణ వ్యక్తి అనుకోకుండా మిఠాయిలు తయారు చేసే ఓ ప్రమాదకర గ్యాంగ్ బారిన పడతాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ సిరీస్ లో చూడాలి. ఇందులో మానవ్ కౌల్, తిలోత్తమ షోమ్ తోపాటు కొత్త బంగారు లోకం నటి శ్వేతా బసు ప్రసాద్, సుమిత్ గులాటి, నరేష్ గోసేన్, నైనా సరీన్, ఫైజల్ మాలిక్, అశోక్ పాఠక్ లాంటి వాళ్లు కూడా నటించారు.

ఈ వెబ్ సిరీస్ ను మ్యూజిక్ కంపోజర్ రామ్ సంపత్ నిర్మించగా. అమృత్ రాజ్, పునీత్ కృష్ణ డైరెక్ట్ చేశారు. పునీత్ ఈ సిరీస్ కు రచయితగానూ ఉన్నాడు. త్రిభువన్ మిశ్రా జీవితంలోని హాస్యం, తాను మనుగడ సాగించడానికి తీసుకున్న కొన్ని తీవ్రమైన నిర్ణయాల మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ సిరీస్ ను రాసుకున్నట్లు రైటర్ పునీత్ చెప్పాడు.

నెట్‌ఫ్లిక్స్ టాప్ వెబ్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మధ్యే కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 రాగా.. అంతకుముందు వచ్చిన హీరామండి, మామ్లా లీగల్ హై, కాలా పానీ, ది రైల్వేమెన్ లాంటివి కూడా బాగుంటాయి. ఇక ఇప్పుడీ త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ తో కామెడీ జానర్లోనూ తొలిసారి ఈ ఓటీటీ వెబ్ సిరీస్ తీసుకురాబోతోంది. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి.

టీ20 వరల్డ్ కప్ 2024