ABANDONEDMatch 23 Florida
SL
NEP
Match Abandoned without toss
ABANDONEDMatch 30 Florida
USA
IRE
Match Abandoned without toss
ABANDONEDMatch 33 Florida
IND
CAN
Match Abandoned without toss
UPCOMINGFinalBarbados
SASA
INDIND
29 Jun 202408:00 PM
Match begins at 20:00 IST (14:30 GMT)
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టీ20 వరల్డ్ కప్

టీ20 వరల్డ్ కప్ 2024 ఓవర్‌వ్యూ

టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనున్న సంగతి తెలుసు కదా. భారత కాలమానం ప్రకారం చూస్తే జూన్ 2 ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. దీంతో చాలా వరకు మ్యాచ్ లు మన టైమ్ జోన్ ప్రకారం ఉదయం 6 గంటలకు లేదంటే రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్స్

టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్స్ ఉంటాయి.

గ్రూప్ ఎ - ఇండియా, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ

గ్రూప్ బి - ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ సి - న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, పపువా న్యూ గినియా, ఉగాండా

గ్రూప్ డి - సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

ప్రతి గ్రూపులో ఒక్కో టీమ్ మిగిలిన అన్ని టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గరిష్ఠంగా అన్ని మ్యాచ్ లు గెలిచిన జట్టుకు 8 పాయింట్లు వస్తాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు టీమ్స్ సూపర్ 8 స్టేజ్ కు వెళ్తాయి. సూపర్ 8లో రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. అందులో ఒక్కో గ్రూపు నుంచి రెండేసి టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి.

టీ20 వరల్డ్ కప్ 2024 వేదికలు

టీ20 వరల్డ్ కప్ 2024 వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ లోని మొత్తం 9 స్టేడియాల్లో జరుగుతాయి. అందులో ఆరు వెస్టిండీస్ లో, మూడు అమెరికాలో ఉన్నాయి. వెస్టిండీస్ లో సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, కెన్సింగ్టన్ ఓవల్, ప్రావిడెన్స్ స్టేడియం, డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్, ఆర్నోస్ వేల్ స్టేడియం, బ్రియాన్ లారా క్రికెట్ అకాడెమీ స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతాయి.

ఇక అమెరికాలో సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రాయిరీ స్టేడియంలో మ్యాచ్ లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదీ ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఎలో భాగంగా లీగ్ స్టేజ్ లో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల వివరాలు, భారత కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సమయాలు ఇక్కడ చూడొచ్చు.

ఇండియా వెర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 రాత్రి 8 గంటలకు.. ( న్యూయార్క్)

ఇండియా వెర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)

ఇండియా వెర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)

ఇండియా వెర్సెస్ కెనడా - జూన్ 15 రాత్రి 8 గంటలకు (లాండర్‌హిల్)

టీ20 వరల్డ్ కప్ న్యూస్

పాయింట్ల టేబుల్

PosTeamMatchesWonLostTiedNRPointsNRRSeries Form
1INDIAIndia330006+2.017
WWW
2AFGHANISTANAfghanistan321004-0.305
WWL
3AUSTRALIAAustralia312002-0.331
LLW

లీడర్ బోర్డు

  • ప్లేయర్స్
  • టీమ్స్

Most Runs

Rahmanullah Gurbaz
Afghanistan
281రన్స్

‌Most Wickets

Fazalhaq Farooqi
Afghanistan
17వికెట్లు

టీ20 వరల్డ్ కప్ తరచూ అడిగే ప్రశ్నలు

Q. టీ20 వరల్డ్ కప్ 2024లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి?

A. టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం 20 టీమ్స్ తలపడుతున్నాయి.

Q. టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం ఎన్ని మ్యాచ్ లు జరగనున్నాయి?

A. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా మొత్తం 55 మ్యాచ్ లు జరుగుతాయి.

Q. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరిగేది ఎప్పుడు?

A. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరుగుతుంది.

Q. టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తొలి మ్యాచ్ ఎప్పుడు జరగనుంది?

A. టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది.

Q. టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?

A. టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జరుగుతుంది.