తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Vs Inzamam: కాస్త బ్రెయిన్ వాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు క్లాస్ పీకిన రోహిత్.. అతని రియాక్షన్ ఇదీ

Rohit vs Inzamam: కాస్త బ్రెయిన్ వాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు క్లాస్ పీకిన రోహిత్.. అతని రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
Jun 28, 2024 09:07 PM IST

Rohit vs Inzamam: కాస్త బ్రెయిన్ వాడు అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ పీకాడు. దీనిపై ఆ మాజీ క్రికెటర్ ఇంజమామ్ కూడా ఘాటుగానే స్పందించాడు.

కాస్త బ్రెయిన్ వాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు క్లాస్ పీకిన రోహిత్.. అతని రియాక్షన్ ఇదీ
కాస్త బ్రెయిన్ వాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు క్లాస్ పీకిన రోహిత్.. అతని రియాక్షన్ ఇదీ (Getty-AFP)

Rohit vs Inzamam: టీమిండియా బౌలర్లపై మరోసారి తమ అక్కసు వెల్లగక్కిన పాక్ మాజీ క్రికెటర్ ఇంజమాముల్ హక్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటైన రిప్లై ఇచ్చాడు. కాస్త బ్రెయిన్ వాడు అంటూ అతనికి సూచించ���డు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 15వ ఓవర్లోనే రివర్స్ స్వింగ్ కావడంపై ఇంజమామ్ అనుమానం వ్యక్తం చేయగా.. దానికి రోహిత్ ఇచ్చిన సమాధానంపై అతడు స్పందించాడు.

రోహిత్ వర్సెస్ ఇంజమామ్

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్లోనే రివర్స్ స్వింగ్ చేశాడని, దీని వెనుక ఏదో మతలబు ఉందంటూ పరోక్షంగా టీమిండియాపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేశాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. ఇవే విషయాన్ని రోహిత్ దగ్గర ప్రస్తావించగా.. అసలు అక్కడ రివర్స్ స్వింగ్ ఎందుకు అవుతుందో చెబుతూ కాస్త బ్రెయిన్ వాడు అంటూ ఘాటుగా స్పందించాడు.

"దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఇలాంటి వేడి వాతావరణంలో ఆడుతున్నప్పుడు, పిచ్ లు ఇంత పొడిగా ఉన్నప్పుడు బంతి దానికదే రివర్స్ అవుతుంది. అన్ని జట్లకు బాల్ రివర్స్ స్వింగ్ అవుతోంది. మాకే కాదు. కొన్నిసార్లు బ్రెయిన్ వాడటం కూడా అవసరం. మేము ఎక్కడ ఆడుతున్నామో మీకు తెలిసి ఉండాలి. మ్యాచ్ లు ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో జరగడం లేదు" అని రోహిత్ అన్నాడు.

రోహిత్ కూడా ఒప్పుకున్నాడు కదా: ఇంజమామ్

రోహిత్ కామెంట్స్ పై ఇప్పుడు ఇంజమామ్ స్పందించాడు. "మనం కచ్చితంగా మన బ్రెయిన్ వాడాల్సిందే. కానీ మొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే.. రోహిత్ కూడా రివర్స్ అవుతోందని అంగీకరించాడు. అంటే మేము చెప్పింది నిజమే. రెండోది రోహిత్ మాకు రివర్స్ స్వింగ్ ఎలా చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎండ ఉండాలి? ఎలాంటి పిచ్ పై అన్నది అసలు రివర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన మాకు చెప్పొద్దు. ఇలాంటివి మాట్లాడొద్దని అతనికి చెప్పండి" అని ఇంజమామ్ అన్నాడు.

"నేను అంపైర్లకు కేవలం సలహా ఇచ్చాను. బంతి 15వ ఓవర్లోనే అలా అవుతోందంటే కాస్త చూస్తూ ఉండాలని అంపైర్లకు చెప్పాను. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మీ కళ్లు తెరిచే ఉంచండి అని ఇప్పటికీ చెబుతున్నాను. ఏం జరుగుతోంది? అంపైర్లు కూడా తమ బ్రెయిన్ వాడితే అందులో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచిది" అని ఇంజీ అన్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024