తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Revanth Reddy: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓట్లతోనే 7 స్థానాల్లో బీజేపీ గెలిచిందన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓట్లతోనే 7 స్థానాల్లో బీజేపీ గెలిచిందన్న రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Jun 05, 2024 01:32 PM IST

Revanth Reddy: తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లతోనే బీజేపీ 7స్థానాల్లో విజయం సాధించిందని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఆత్మబలిదానం ద్వారా బీజేపీని గెలిపించడాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

బీఆర్‌ఎస్‌ ఓట్ల బదిలీ వల్లే బీజేపీకి ఏడు స్థానాల్లో గెలుపు దక్కిందన్న రేవంత్ రెడ్డి
బీఆర్‌ఎస్‌ ఓట్ల బదిలీ వల్లే బీజేపీకి ఏడు స్థానాల్లో గెలుపు దక్కిందన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ పార్లమెంటులో ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఖచ్చితంగా 100రోజుల కాంగ్రెస్‌ ప పరిపాలనకు రెఫరెండం అని తాను చెప్పానని అదే నిజమైందని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. మా పరిపాలన ప్రజలకు నచ్చితే తీర్పునివ్వాలని ప్రజలకు వివరించానని, చాలామంది రెఫరెండం అనకుండా ఉండాల్సిందని తనకు సూచించారని, ప్రజలపట్ల విశ్వాసం,కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉన్న నమ్మకంతో రెఫరెండం అనే తాను చెప్పానని గుర్తు చేశారు. ఆ విషయంలో మళ్లీ వెనుదిరిగి చూడలేదన్నారు. ఫలితాలు తాము ఆశించిన స్థాయిలో లేవని ఇంకా రెట్టింపు కష్టిస్తామన్నారు. మల్కాజ్‌గిరిలో సిట్టింగ్ స్థానం కోల్పోయామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన ఓట్లను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 17 పార్లమెంటు సీట్లలో ఒకటి ఎంఐఎం, ఎనిమిది బీజేపీకి, ఎనిమది కాంగ్రెస్‌ వచ్చాయని, తమ పార్టీకి ఎనిమిది స్థానాల్లో 41శాతం ఓట్లు వచ్చాయని, డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లు వచ్చాయని, పార్లమెంటు ఎన్నికల్లో 41.5శాతం ఓట్లను ప్రజలకు తమకు ఇచ్చారని, తమ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఓట్లు పెరిగాయని, 2019లో మూడు పార్లమెంటు సీట్లు గెలిస్తే తాజా ఎన్నికల్లో ఎనిమిది సీట్లు ఇచ్చారని, ఓట్లు సీట్లలో తమను ఆదరించారని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ప్రజలు ఓట్లు వేస్తే 64సీట్లలో మెజార్టీ వచ్చిందని, తాజా ఎన్నికల్లో కంటోన్మెంట్‌ 65వ స్థానంగా కాంగ్రెస్‌ పార్టీకి అదనంగా ఇచ్చారని చెప్పారు. 65సీట్లతో తాజా తీర్పు ద్వారా ప్రజలు తమను సమర్ధించారన్నారు. తమకు అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించారని, కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, మంత్రి వర్గ సహచరులకు, శాసనసభ్యులకు రాష్ట్ర, మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఓట్ల స్థానంలో, సీట్ల లెక్కలో అత్యధిక సీట్లను తమకు కట్టబెట్టారని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన బీజేపీ 2019లో నాలుగు సీట్లు గెలిచిందని, బీజేపీ కూడా 20 శాతం నుంచి 35శాతం ఓట్లు పెరిగాయని, బీజేపీ ఓట్లు, సీట్లు పెరిగాయని, బీజేపీ ఓట్లు, సీట్లు పెరగడానికి బీఆర్‌ఎస్‌ నాయకులు అవయవదానం చేసి బీజేపీని గెలిపించారన్నారు. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయిందన్నారు.

ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మహబూబాబాద్‌, కరీంనగర్, నిజామాబాద్‌, మల్కాజ్‌గిరిలలో బీఆర్‌ఎస్‌ ఆత్మబలిదానం చేసిందన్నారు. బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టి బీజేపీకి బీఆర్‌ఎస్‌నేతలు సహకరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ సిద్ధిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి 2023 వరకు ఎప్పుడు లక్ష మెజార్టీ తగ్గలేదని, సిద్ధిపేటలో అత్యధిక మెజార్టీ వచ్చేదని, తాజా పార్లమెంటు ఎన్నికల్లో హరీష్‌ రావు సిద్ధిపేటలో బీజేపీకి సహకరించారని, సిద్ధిపేటలో బీఆర్ఎస్‌ మెజార్టీ 2500మాత్రమేనని, బీఆర్ఎస్‌ ఓట్లు మొత్తాన్ని బీజేపీకి బదిలీ చేయడం ద్వారా మెదక్‌లో బలహీన వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోయాడని, బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మబలిదానం చేసి బీజేపీని బీఆర్‌ఎస్ గెలిపించిందని, ఏడు పార్లమెంటు స్థానాల్లో 35.65శాతం ఓట్ల నుంచి 16.5శాతానికి ఆ పార్టీ పడిపోయిందన్నారు.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13శాతం ఓట్లు వచ్చాయని, తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు 33.5 శాతం పెరిగాయని, బీఆర్‌ఎస్‌కు చెందిన 21 శాతం ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం వల్ల బీజేపీ ఏడు చోట్లు గెలిచిందన్నారు. బీజేపీ గెలిచిన ఏడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ న���ంచి జరిగిన ఓట్ల బదిలీ వల్లే ఆ పార్టీ గెలిచిందని హరీష్‌ రావు ఆరోపించారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నాయకుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్‌,కేటీఆర్‌ తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను బీజేపీకి తాకట్టు పెట్టడాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. ప్రజాస్వామిక వాదులంతా ఈ అరాచకాన్ని గుర్తించాలన్నారు.

తెలంగాణలో తనంతట తాన అంతర్థనం అయిపోతూ, దురాగతానికి పాల్పడ్డాడని, ఫినిక్స్ లా మళ్లీ లేస్తానని చెబుతున్నారని, బీఆర్‌ఎస్‌ చరిత్రలో తొలిసారి ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయిందని, చంద్రశేఖర్‌ రావు పాపాలు వెంటాడు తున్నాయని, కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారని అందుకే ఘోరంగా ఓడించారన్నారు.

హరీష్‌ రావు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను ఓడించామనుకుంటే చివరి వారి ఉనికి, రాష్ట్రంలో చట్టసభల్లో లేకుండా కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. బీఆర్‌‌ఎస్ కుట్రలను తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు.

జాతీయ రాజకీయాల్లో మోదీ హవాకు అడ్డుకట్ట పడిందని, మోదీ గ్యారంటీలను ప్రజలు తిరస్కరించారని, దేశ ప్రజలు మోదీని తిరస్కరించారని, ప్రధానమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేసి, ఆ పదవిని చేపట్టకూడదన్నారు. తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాలకు తనదే పూర్తి బాధ్యత అన్నారు. కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకుని తన అవయవాలను మోదీకి బదిలీ ఇచ్చాడని, అలా ఎందుకు ఇచ్చాడో ఆయనే సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఉమ్మడి రాజధాని పరిష్కారం…

తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చర్చిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని అంశంగా చట్టప్రకారం పరిష్కారమైపోయిందన్నారు. ఏపీలో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటామని చెప్పారు. ఏపీ అంతర్గత వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండదన్నారు. ఏపీ ప్రజల తీర్పును జగన్ స్వాగతించారని రేవంత్ గుర్తు చేశారు. 

2014లోనే మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో ప్రకటించారని ఆ ప్రకటనకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాహుల్ గాంధీ ఈ విషయం ఇప్పటికే పలుమార్లు ప్రకటించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. 

WhatsApp channel