తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Watched Telugu Web Series: జీ5 ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఇవే

Most Watched Telugu Web Series: జీ5 ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 30, 2024 02:34 PM IST

Most Watched Telugu Web Series: ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన జీ5లో ఎక్కువ మంది చూసి కొన్ని తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకూ మీరు వాటిని చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి.

జీ5 ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఇవే
జీ5 ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ఇవే

Most Watched Telugu Web Series: ఈ ఓటీటీలు, వెబ్ సిరీస్‌ల యుగంలో తెలుగులోనూ చెప్పుకోదగిన సిరీస్ లు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలకు మించి థ్రిల్ పంచాయి. అలాంటివి జీ5 (zee5) ఓటీటీలో చాలానే ఉన్నాయి. అందులోనూ క్రైమ్ వెబ్ సిరీస్ కావడంతో వీటిని ఎగబడి చూశారు. మరి ఆ వెబ్ సిరీస్ ఏవో తెలుసుకొని మీరూ ఓ వీకెండ్ చూడటానికి ప్లాన్ చేయండి.

జీ5 ఓటీటీలోని టాప్ వెబ్ సిరీస్

గాలివాన

జీ5లోని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లో గాలివాన ఒకటి. టాలీవుడ్ సీనియర్ నటీనటులు సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందినీ చౌదరి నటించిన ఈ వెబ్ సిరీస్.. ప్రముఖ బ్రిటీష్ సిరీస్ వన్ ఆఫ్ అజ్ ఆధారంగా రూపొందింది. ఓ ఊళ్లోని ఓ ఫ్యామిలీ, ఓ దారుణమైన హత్య చుట్టూ తిరిగే ఈ క్రైమ్ డ్రామా ఆసక్తికరమైన ట్విస్టులతో సాగిపోతుంది. 8 ఎపిసోడ్ల సిరీస్ కు శరన్ కోపిశెట్టి దర్శకత్వం వహించాడు.

షూటౌట్ ఎట్ ఆలేర్

శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ నటించిన మరో తెలుగు వెబ్ సిరీస్ షూటౌట్ ఎట్ ఆలేర్. హైదరాబాద్ లోని పాతబస్తీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ను ఆనంద్ రంగా డైరెక్ట్ చేశాడు. ఆలేర్ లో జరిగిన ఓ షూటౌట్ ను ఓ పోలీస్ బృందం ఎలా చేజ్ చేసిందన్నదే ఈ సిరీస్ కథ. దీనిని చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల ప్రొడ్యూస్ చేయడం విశేషం.

పులి మేక

పులి మేక కూడా మంచి ట్విస్టులు ఉన్న క్రైమ్ డ్రామానే. లావణ్య త్రిపాఠీ, ఆది సాయికుమార్ నటించిన ఈ సిరీస్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కోన వెంకట్ ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ ను చక్రవర్తి రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి.

ఏటీఎం వెబ్ సిరీస్

బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ నటించిన క్రైమ్ వెబ్ సిరీస్ ఏటీఎం. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రొడ్యూస్ చేశాడు. చంద్ర మోహన్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. ఓ నేరానికి పాల్పడిన స్నేహితుల బృందం తర్వాత దాని నుంచి ఎలా బయటపడిందన్నదే ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ లో చూపించారు.

రెక్కీ వెబ్ సిరీస్

రెక్కీ వెబ్ సిరీస్ లో శ్రీరామ్, శివ బాలాజీలాంటి వాళ్లు నటించారు. ఈ క్రైమ్ డ్రామాను పోలూరు కృష్ణ డైరెక్ట్ చేశాడు. తండ్రినే చంపాలనుకునే ఓ కొడుకు కథే ఈ రెక్కీ. ఏడు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ కూడా జీ5 ఓటీటీలో ఉన్న టాప్ వెబ్ సిరీస్ లో ఒకటి.

ఇవన్నీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. ఇవే కాకుండా జీ5 ఓటీటీలో లూజర్, చదరంగం, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట లాంటి వివిధ జానర్ల వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024