తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott News: యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT News: యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jun 28, 2024 03:50 PM IST

OTT News: యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటి త‌ృప్తి దిమ్రి నటిస్తున్న మూవీ బ్యాడ్ న్యూస్. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రైమ్ వీడియో చేతికి దక్కాయి.

యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT News: యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో కలిసి కొన్ని బోల్డ్ సీన్లలో నటించిన తృప్తి దిమ్రి.. ఇప్పుడు మరో బోల్డ్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో ఆఫర్లు రాగా.. ప్రస్తుతానికి బ్యాడ్ న్యూస్ అనే మూవీ రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముందు డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ కూడా రివీలైంది.

తృప్తి దిమ్రి బ్యాడ్ న్యూస్ ఓటీటీ

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, ఆమీ విర్క్ తో కలిసి తృప్తి నటిస్తున్న మూవీ బ్యాడ్ న్యూస్. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో ఆడిన తర్వాత ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (జూన్ 28) సాయంత్రం 4.30 గంటలకు రిలీజ్ కానుంది.

ఆనంద్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నాడు. నేహా దూపియా కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. బ్యాడ్ న్యూస్ మూవీ జులై 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ఏంటీ బ్యాడ్ న్యూస్ స్టోరీ?

ఈ బ్యాడ్ న్యూస్ మూవీ కాస్త బోల్డ్ కంటెంట్ తోనే రాబోతోంది. మిలియన్లలో ఒక కథ కదా.. బిలియన్లలో ఒకటి అని మేకర్స్ గతంలోనే చెప్పారు. గతంలో గుడ్ న్యూస్ మూవీని తెరకెక్కించిన వాళ్లే ఇప్పుడీ బ్యాడ్ న్యూస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ చెప్పడం విశేషం.

ఇద్దరు పంజాబీ యువకులు, ఓ క్రిస్టియన్ హిందూ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఇద్దరిలో ఒకరు ఓ రాత్రి ఆ అమ్మాయితో కలిసి గడుపుతారు. ఆ ఇద్దరి మధ్య అనుకోకుండా జరగకూడదనిది జరిగిపోతుంది. తర్వాత ఆ అమ్మాయి ఊహించని రీతిలో ప్రెగ్నెంట్ అని తేలుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

మరోవైపు తృప్తి దిమ్రి యానిమల్ మూవీ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ బ్యాడ్ న్యూస్ మూవీ తర్వాత విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో, భూల్ భులయ్యా 3, ధడక్ 2లాంటి సినిమాలు చేస్తోందామె. అయితే బోల్డ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ బ్యాడ్ న్యూస్ మూవీ ఆమెకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

టీ20 వరల్డ్ కప్ 2024