తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Day 1 Collection: తొలిరోజే రికార్డులు కొల్లగొట్టిన కల్కి.. ఏ భాషలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

Kalki Day 1 Collection: తొలిరోజే రికార్డులు కొల్లగొట్టిన కల్కి.. ఏ భాషలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Jun 28, 2024 11:25 AM IST

Kalki 2898 AD Box Office Collection Day 1: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేసిన కల్కి సినిమాకు ఏ భాషలో ఎన్నో కోట్లు వచ్చాయో తెలుసుకుందాం.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Kalki 2898 AD Worldwide Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక ఓపెనింగ్స్ సాధించింది.

ఓపెనింగ్ రోజే రికార్డ్స్

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ మొదటి రోజు ఇండియాలో ఏకంగా రూ . 95 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే భారతదేశంలో రూ. 115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే కల్కి చిత్రం బాలీవుడ్ బాద్ షా జవాన్ (తొలిరోజు రూ. 65 కోట్లు) సినిమాను అధిగమించి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ రోజును సాధించిన మూవీగా రికార్డుకెక్కింది.

కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్

అలాగే కల్కి సినిమాకు ఓవర్సీస్ నుంచి రూ. 65 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లు రాబట్టింది. అయితే, ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి ఆర్ఆర్ఆర్ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.

ఒక్కో భాషలో ఎన్ని కోట్లంటే

ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ తొలి రోజు అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ.95 కోట్లు రాగా వాటిలో ఒక తెలుగులో రూ. 64.5 కోట్లు వచ్చాయి. అలాగే తమిళంలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 24 కోట్లు, మలయాళంలో రూ. 2.2 కోట్లను కల్కి 2898 ఏడీ సినిమా రాబట్టింది. అంటే, గత ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం తొలిరోజు రూ. 65.5 కోట్లు వసూలు చేసిన రికార్డును అధిగమించింది.

రికార్డ్ బ్రేక్ చేసిన సినిమాలు

ఇక కల్కి 2898 ఏడీ సినిమాకు గురువారం మొత్తం 85.15 శాతంగా తెలుగు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. కాగా కల్కి సినిమా ఆర్ఆర్ఆర్‌ (రూ.223.5 కోట్లు) తోపాటు బాహుబలి 2 (రూ. 214.5 కోట్లు) సినిమాల మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చేరుకోలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ. 164.5 కోట్లు) , సలార్ (రూ. 158 కోట్లు) ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ. 125.6 కోట్లు) రికార్డ్స్ బ్రేక్ చేసింది.

కాంప్లెక్స్ సిటీకి

ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవు అనే బాంటీ హంటర్ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. అతను కాంప్లెక్స్ సిటీకి చేరుకునేందుకు ఎలాంటి పనులు చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక కాంప్లెక్స్ పాలకుడు సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో లోకనాయకుడు కమల్ హాసన్ అద్భుతమైన నట ప్రదర్శన చూపించారని టాక్ వస్తోంది.

ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం వంటి స్టార్స్ సైతం నటించారు. ఇక అశ్వత్థామగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే.

టీ20 వరల్డ్ కప్ 2024