HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 : జులై 1న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

AP TET 2024 : జులై 1న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

30 June 2024, 20:08 IST

    • AP TET 2024 : ఏపీలో మెగా డీఎస్సీకి రంగం సిద్ధమైంది. డీఎస్సీకి ముందు మరో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు(జులై 1) కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
జులై 1న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
జులై 1న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

జులై 1న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

AP TET 2024 : ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ జులై1న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 2 నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఏపీ టెట్ (జులై)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. టెట్ షెడ్యూల్, నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్లైన్ విధానంలో (CBT) జరిగే పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలు అన్ని అధికారిక వెబ్ సైట్ త్వరలో ప్రకటిస్తామన్నారు. జులై 2 నుంచి అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో పూర్తి సమాచారం పొందవచ్చని తెలిపారు. ఇతర సమాచారం కోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసు హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే

APSRTC Kashi Ayodhya Tour : కాశీ, అయోధ్య సహా 14 పుణ్య క్షేత్రాల సందర్శన- హిందూపురం నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు

Power Star Brand : ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్-మీరే తెచ్చారంటూ వైసీపీ, కూటమి పార్టీల మధ్య వార్

Special Trains : పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే

త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

ఏపీలో ఎన్నికలకు ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత వైసీపీ ప్రభుత్వం టెట్‌ నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35 లక్షల అభ్యర్థులు హాజరుకాగా, 1,37,903 మంది టెట్ అర్హత సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. మెగా డీఎస్సీ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో ఫెయిలైన వారికి మరో అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు.

పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. నేడో, రేపో 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీకానుంది.

డీఎస్సీ పోస్టులు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం