తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Results: ఏపీ టెట్‌ 2024 ఫలితాలు విడుదల, ఫలితాలు తెలుసుకోండి ఇలా…

AP TET 2024 Results: ఏపీ టెట్‌ 2024 ఫలితాలు విడుదల, ఫలితాలు తెలుసుకోండి ఇలా…

Sarath chandra.B HT Telugu
Jun 25, 2024 02:02 PM IST

AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2024 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2024 ఫలితాలు విడుదల

AP TET 2024 Results:ఆంధ్రనప్రదేశ్‌ టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789మంది దరఖాస్తు చేసుకోగా 2,35,907మంది పరీక్షలకు హాజరయ్యారు.ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెట్ పరీక్ష ఫలితాలు విడుదలో జాప్యం జరిగింది.

58.4శాతం ఉత్తీర్ణత…

ఆంధ్రనప్రదేశ్‌ టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789మంది దరఖాస్తు చేసుకోగా 2,35,907మంది పరీక్షలకు హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 88.90శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,37,904మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 58.4శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • పేపర్ 1(ఏ) ఎస్జీటీ రెగ్యులర్ పరీక్షకు 113296మంది దరఖాస్తు చేసుకోగా 78,142మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 66.32శాతం ఉత్తీర్ణులయ్యారు.
  • పేపర్ 1(బి) ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్‌ పరీక్షకు 1700మంది దరఖాస్తు చేసుకోగా 46.47శాతం ఉత్తీర్ణతతో 790మంది ఉత్తీ��్ణులయ్యారు.
  • పేపర్ 2(ఏ) స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పరీక్షలకు 119500 దరఖాస్తు చేసుకోగా 60,846మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం పరీక్షలకు హాజరైన వారిలో 60.93శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • పేపర్ 2(బి) స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 1411మంది దరఖాస్తు చేసుకోగా 1125మంది ఉత్తీర్ణులయ్యారు. 79.73శాతం ఉత్తీర్ణత సాధించారు.మొత్తం పరీక్షలకు హాజరైన వారిలో 58.4శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఏపీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. . ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు ఏపీలో టెట్ పరీక్షల్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.67లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేయగా న 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి.

ఏపీ టెట్‌ ఫలితాలను ఈ లింకు ద్వారా తెలుసుకోండి…

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ టెట్ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ విడుదల అయ్యాయి. ఫలితాలు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టెట్‌ ఫలితాల విడుదలకు ప్రభుత్వం అనుమతించారు.

ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ‌ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ వస్తుంది.‌

ముందుగా విడుదల చేసి‌న షెడ్యూల్ ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది.‌ ఫలితాలు విడుదల కోసం అభ్యర్థులు మూడు నెలలకు పైగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెగా డిఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.

ఏపీలో 16వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండటంతో మరో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. టెట్ తాజా ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి. https://aptet.apcfss.in/CandidateLogin.do

టీ20 వరల్డ్ కప్ 2024