HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Yadav: సూర్యకుమార్ అద్భుత క్యాచ్‍పై రెండు అభ్యంతరాలు చెబుతున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. వివాదం ఎందుకంటే..

Suryakumar Yadav: సూర్యకుమార్ అద్భుత క్యాచ్‍పై రెండు అభ్యంతరాలు చెబుతున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. వివాదం ఎందుకంటే..

30 June 2024, 20:46 IST

    • Suryakumar Yadav Catch: టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలువడంలో ఆ క్యాచ్ కీలకపాత్ర పోషించింది. అయితే, అది వివాదాస్పదం కూడా అయింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ అద్భుత క్యాచ్‍పై రెండు అభ్యంతరాలు చెబుతున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. వివాదం ఎందుకంటే..
Suryakumar Yadav: సూర్యకుమార్ అద్భుత క్యాచ్‍పై రెండు అభ్యంతరాలు చెబుతున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. వివాదం ఎందుకంటే..

Suryakumar Yadav: సూర్యకుమార్ అద్భుత క్యాచ్‍పై రెండు అభ్యంతరాలు చెబుతున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. వివాదం ఎందుకంటే..

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ హిస్టరీలోనే ఒకానొక గ్రేట్ క్యాచ్ పట్టాడు. అది కూడా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో చాలా కీలకమైన సమయంలో బౌండరీ లైన్ వద్ద అద్భుతం చేశాడు. బార్బడొస్ వేదికగా దక్షిణాఫ్రికాతో శనివారం (జూన్ 29) జరిగిన ఫైనల్‍లో టీమిండియా గెలిచి టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకోవడంలో సూర్య పట్టిన ఆ క్యాచ్ కీలకపాత్ర పోషించింది. అయితే, ఈ క్యాచ్‍పై రెండు అభ్యంతరాలను దక్షిణాఫ్రికా అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివాదం రేగుతోంది. ఆ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Rahul Dravid: ఆ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు చాలా థ్యాంక్స్: రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్

Rohit Sharma: అందుకే ఆ మట్టి తిన్నాను: వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తాను అలా ఎందుకు చేశాడో వివరించిన రోహిత్ శర్మ

Team India Zimbabwe Tour: జింబాబ్వే బయలుదేరిన టీమిండియా.. జట్టులో ఆ ముగ్గురు వరల్డ్ కప్ స్టార్లు కూడా..

Team India Home Coming: తుఫానులో చిక్కుకు పోయిన ఇండియన్ ప్లేయర్స్.. వరల్డ్ కప్ హీరోలు వచ్చేది ఆ రోజే..

చివరి ఓవర్లో గెలుపు కోసం దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. బంతి సిక్స్ వెళ్లేలా అనిపించింది. అయితే, బౌండరీ లైన్ సమీపంలో ఎగిరి బంతిని అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత బౌండరీ లైన్ బయటికి తాను వెళుతుండటంతో బంతిని గాల్లోకి ఎగరేశాడు. మళ్లీ లోపలికి వచ్చి బంతిని అందుకొని క్యాచ్ పూర్తి చేశాడు. బౌండరీ లైన్‍కు కేవలం మిల్లీ మీటర్ల దూరంలోనే ఇదంతా జరిగింది. మ్యాచ్‍ను మలుపు తిప్పే టైటిల్ విన్నింగ్ క్యాచ్ పట్టాడు సూర్య. కానీ ఈ క్యాచ్‍పై దుమారం రేగింది.

మొదటి అభ్యంతరం

సూర్యకుమార్ యాదవ్ బంతి చేతులో పట్టుకొని పరుగెత్తుతున్నప్పుడే అతడి కాలు బౌండరీ కుషన్‍కు తగిలిందని కొందరు దక్షిణాఫ్రికా అభిమానులు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తున్నారు. బౌండరీ లైన్ కదిలిందని అంటున్నారు. ఆ క్యాచ్‍ను థర్డ్ అంపైర్ ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చూడాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆ బౌండరీ కుషన్ కదిలినట్టు షేర్ చేస్తున్న వీడియోల్లోనూ స్పష్టంగా లేదు.

రెండో అభ్యంతరం

సూర్యకుమార్ క్యాచ్ పట్టే ముందు బౌండరీ రోప్‍ను వెనక్కి జరిపారనే అభ్యంతరాలను కూడా కొందరు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. బౌండరీ లైన్ వెనక్కి జరిపినట్టుగా గ్రౌండ్‍పై చార స్పష్టంగా కనిపిస్తోందని, దానిపై పరుగెత్తుకుంటూ వెళ్లి సూర్య క్యాచ్ పట్టాడని అంటున్నారు. అందుకే దాన్ని సిక్స్ ఇవ్వాల్సిందని వాదిస్తున్నారు. అయితే, ఈ క్యాచ్‍కు ముందే బౌండరీ లైన్ వెనక్కి జరిపినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. మ్యాచ్ ముందే బౌండరీ లైన్ జరిపి ఉండొచ్చని తెలుస్తోంది.

మొత్తంగా తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ చేరి టైటిల్‍ను దక్షిణాఫ్రికా చేజార్చుకోవడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. కొందరు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‍పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. అందుకు ఆధారాలు లేవు. వివాదం మాత్రం రేగింది.

మిల్లర్ ఔటయ్యాక కగిసో రబాడ బ్యాట్ ఎడ్జ్ తగిలి ఓ బౌండరీ వచ్చింది. దీంతో చివరి నాలుగు బంతులకు 12 పరుగులు చేయాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో భారత్ విజయ తీరాన్ని దాటింది.

టీమిండియా 17 సంవత్సరాల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ సొంతం చేసుకుంది. 2007 తర్వాత రెండోసారి ఇప్పుడు టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది. ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న ఐసీసీ టైటిల్ గెలువడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా చాలా మంది ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

తదుపరి వ్యాసం