తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyabhama Ott: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి!

Satyabhama OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jun 28, 2024 10:38 AM IST

Kajal Aggarwal Satyabhama OTT Streaming: చందమామ కాజల్ అగర్వాల్ నటించి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాజల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఈ ఓటీటీలో చూసేయండి.

ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి!

Crime Thriller Satyabhama OTT Release: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసుకుంది చందమామ కాజల్ అగర్వాల్. 20 ఏళ్లుగా సినీ కేరీర్‌లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ టాలీవుడ్ చందమామ. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది అగ్ర కథానాయకులతో జత కట్టి ఆడిపాడిన కాజల్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఆ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చి వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఫ్యామిలీకే ఫుల్ టైమ్ స్పెండ్ చేసింది. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ చేసిన లేడి ఒరియెంటెడ్ మూవీ సత్యభామ.

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. ఇదివరకు తమిళ మువీ జిల్లాలో పోలీస్‌గా కాజల్ నటించినప్పటికీ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్‌గా చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూసేసరికి సత్యభామపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో కాజల్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఎన్నో అంచనాలతో జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ సినిమాలో అనేక విషయాలు టచ్ చేస్తూ వెళ్లారని, ఏది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని కామెంట్స్ వినిపించాయి. దాంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అలా సినిమాకు యావరేజ్ ఫలితం దక్కింది.

ఇప్పుడు సత్యభామ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన 20 రోజులకు సడెన్‌గా ఓటీటీలో దర్శనం ఇచ్చింది సత్యభామ సినిమా. ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా చడీచప్పుడు కాకుండా సైలెంట్‌గా సత్యభామను ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. కాజల్ అగర్వాల్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన సత్యభామ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 27 అంటే ఇవాళ్టి నుంచి కేవలం తెలుగు భాషలో సత్యభామ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. థియేటర్‌లలో మిస్ అయిన ఈ సినిమాను ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సత్యభామ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే, సత్యభామ సినిమాకు సుమన్ చిక్కాలా దర్శకత్వం వహించారు. అవురమ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. దీనికి మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమాతో క్వీన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్‌ను కాజల్ అగర్వాల్‌కు ఇచ్చారు. ఇక ఈ మూవీలో కాజల్‌తోపాటు హీరో నవీన్ చంద్ర కూడా కీ రోల్ ప్లే చేశాడు.

సినిమా ప్రమోషన్స్ సమయంలో సత్యభామ గురించి అనేక విశేషాలు చెప్పారు కాజల్ అగర్వాల్. యూత్, బెట్టింగ్‌‌తో పాటు ఓ రిలీజియన్‌కు సంబంధించిన కీ పాయింట్స్ సినిమాలో ఉంటాయన్నారు. కానీ, ఏ మతానికి పాజిటివ్‌గా కానీ లేదా నెగెటివ్‌గా గానీ చూపించడం జరగలేదని కాజల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమాలో ఎన్నో ట్విస్టులు, టర్న్స్ ఉంటాయని కాజల్ చెప్పుకొచ్చారు.

టీ20 వరల్డ్ కప్ 2024