తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crush On You: ఒక అబ్బాయికి మీమీద క్రష్ ఉందని ఎలా తెలుస్తుంది? ఈ లక్షణాలుంటే నో డౌట్..

Crush on you: ఒక అబ్బాయికి మీమీద క్రష్ ఉందని ఎలా తెలుస్తుంది? ఈ లక్షణాలుంటే నో డౌట్..

Koutik Pranaya Sree HT Telugu
Jun 28, 2024 09:30 AM IST

Crush on you: మీమీద ఒకబ్బాయికి క్రష్ ఉందా లేదా అనే సందేహం ఉందా? అయితే కింద చెప్పిన విషయాలు కొన్ని గమనించండి. వాళ్లలో ఈ లక్షణాలుంటే మీమీద ఆసక్తి చూపిస్తున్నట్లే.

అబ్బాయికి క్రష్ ఉందా లేదా అని తెలిపే లక్షణాలు
అబ్బాయికి క్రష్ ఉందా లేదా అని తెలిపే లక్షణాలు (pexels)

మీరు ఈ ఆర్టికల్ చదవుతున్నారూ అంటే.. మీ లైఫ్ లో ఎవరో ఒక అబ్బాయికి మీమీద ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నమాట. మీరు అబ్బాయి అయితే మీకు ఎవరిమీదైనా క్రష్ ఉందేమో అనే సందేహం మీకుందన్న మాట. స్కూల్, కాలేజీ, ఆఫీసుల్లో, చుట్టాల్లో.. ఎవరికో ఒక అబ్బాయికి మీమీద ఇష్టం ఉందని మీకు అనిపిస్తుంది. యూత్ భాషలో చెప్పాలంటే క్రష్ ఉండటం అన్నమాట. స్నేహాన్ని మించిన ప్రేమ అనుకోవచ్చు. అయితే నిజంగానే ఒకబ్బాయికి మీమీద క్రష్ ఉంటే వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? చూసేయండి మరి..

1. మీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తారు:

మీరు ఒక ఫ్రెండ్స్ గ్రూపులో ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఏదైనా విషయం చెప్పినా, లేదా జోక్ వేసినా వెంటనే మీరెలా రియాక్ట్ అవుతారని మీ వైపు చూస్తారు. వాళ్లకు మీరు స్పందించే తీరు చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఇది మంచి ట్రిక్. ఒకసారి గమనించి చూడండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్లు చేసే ఒకరకమైన ప్రయత్నం ఇది.

2. కళ్లలోకి చూడటం:

మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్లల్లోకి చూస్తే మాట్లాడతారు. మీరేం చెప్పినా శ్రద్దగా వింటారు. మీరు ఎంత మందిలో ఉన్నా మిమ్మల్ని గమనిస్తారు. మీరేం చేస్తున్నారో చూస్తూ ఉంటారు.

3. గొంతు తగ్గించి మాట్లాడతారు:

అబ్బాయిల గొంతు మామూలుగానే కాస్త పెద్దగా ఉంటుంది. కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నిదానంగా, మెల్లగా, కాస్త సిగ్గుతో, భయంతో, బిడియంతో మాట్లాడతారు. మీ ముందు ధైర్యంగా ఉండలేకపోవడమే దానికి కారణం. ఈ లక్షణం మీరనుకుంటున్న వ్యక్తిలో ఉందేమో గమనించండి.

4. భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పడం:

వాళ్లు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ప్రమోషన్ గురించి, జాబ్ మారడం గురించి ఆలోచిస్తున్నారా.? లేదా విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి విషయాలన్నీ తరచుగా మీతో ప్రస్తావిస్తు ఉంటారు. మీ ఇష్టాన్ని తెల్సుకోవాలి అనుకోవాలి అనుకుంటారు. వాళ్లు ఊహించుకుంటున్న భవిష్యత్తులో మీరూ ఉండాలనుకుని మీతో ఆ విషయాలన్నీ పంచుకుంటున్నారన్నమాట.

5. మీ గురించి తెల్సుకుంటారు

మామూలుగా మాట్లాడే వాళ్లెవరు మీ గురించి ప్రశ్నలు వేసి మరీ తెల్సుకోరు. అడిగినా ఒకట్రెండు విషయాలు అడిగి ఊరుకుంటారు. మీమీద ఇష్టం ఉన్న వ్యక్తి మీ గురించి ప్రతి విషయం తెల్సుకోవాలి అనుకుంటారు. మీరు చెప్పడం ఆపేసినా వాళ్లు మాత్రం లోతుగా ప్రశ్నలు వేసి మీ జవాబు కోసం ఎదురుచూస్తారు. అలాగే మీరు చెప్పిన చిన్న చిన్న విషయాల్ని కూడా గుర్తుంచుకుంటారు. మీరు ఇంతకముందు కలిసినప్పుడు జరిగిన ప్రతి విషయం గుర్తుంచుకుని మీతో ప్రస్తావిస్తారు. ఇవన్నీ మీమీద ఇష్టాన్ని తెలియజేసేవే.

6. కుళ్లు:

మీరు వేరే అబ్బాయిలతో మాట్లాడితే కాస్త జెలసీగా ఫీల్ అవుతారు. అలాగే ఒక్కోసారి మీకు జెలసీ తెప్పించడానికి మీ ముందు వేరే అమ్మాయిల గురించి, వాళ్ల పాత బంధాల గురించి మాట్లాడతారు. మీరెలా స్పందిస్తున్నారో, జెలసీగా ఫీల్ అవుతున్నారా లేదా అని తెల్సుకోవడానికి కిటుకు అన్నమాట.

పైన చెప్పిన విషయాలన్నీ అందరికీ వర్తిస్తాయని కాదు. సరదాగా మీరొక వ్యక్తికున్న ఇష్టాన్ని తెల్సుకోడానికి కొన్ని సరదా ముచ్చట్లివి. కానీ వీటిలో కొన్ని సరితూగినా మీమీద ఎంతో కొంత ఇష్టం మాత్రం ఉన్నట్లే.

 

WhatsApp channel

టాపిక్