తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shlokas: కోపాన్ని అధిగమించేందుకు, కన్ఫ్యూజన్ పోగొట్టుకునేందుకు ఈ శ్లోకాలు పఠించండి

Shlokas: కోపాన్ని అధిగమించేందుకు, కన్ఫ్యూజన్ పోగొట్టుకునేందుకు ఈ శ్లోకాలు పఠించండి

Gunti Soundarya HT Telugu
Jun 25, 2024 09:21 AM IST

Shlokas: కోపం మనిషి విచక్షణను మర్చిపోయేలా చేస్తుంది. అన్నింటికీ అనార్థాలు తీసుకొస్తుంది. అందుకే కోపం తగ్గించుకోవాలని చెప్తారు. ఈ కోపాన్ని అధిగమించేందుకు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు పఠించడం మేలు జరుగుతుంది.

కోపాన్ని అధిగమించేందుకు ఉపయోగపడే శ్లోకాలు
కోపాన్ని అధిగమించేందుకు ఉపయోగపడే శ్లోకాలు (pixabay)

Shlokas: భగవద్గీత పరిచయం లేని పుస్తకం ఇది. ఒక మనిషి ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలి, సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేర్పిస్తుంది. యుద్ధం గురించి పాఠాలు అయినా, కుటుంబ సంబంధాల గురించి అయినా భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి.

ఇవి మనిషి జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంతో సహాయపడతాయి. జీవితం నిరుత్సాహంగా అనిపించినప్పుడు, ప్రతికూలతలను అధిగమించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మీకు ఉపయోగపడతాయి. భగవద్గీతలోని ఈ ఆరు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.

కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు

శ్లోకం: దుఃఖేశ్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే॥

ఈ శ్లోకం సరళంగా జ్ఞానయుక్తంగా ఉండే మంత్రం. ఎవరి మనసు దుఃఖాల మధ్య కలత చెందకుండా ఉంటుంది. సుఖాల కోసం తహతహలాడకుండా ఉంటుంది అనుబంధం, భయం, కోపం లేని వ్యక్తిని స్థిరమైన జ్ఞానం గల జ్ఞాని అంటారని ఈ శ్లోకం పరమార్ధం. కోపం ఒక వ్యక్తి మంచితనాన్ని కప్పివేస్తుంది. కోపంలో వాళ్లు మాట్లాడే మాటలు చేసే పనులు తర్వాత పశ్చాత్తాపడే చర్యలకు దారితీస్తుందని ఈ మంత్రం వివరిస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ మంత్రం పఠించడం వల్ల స్థిరమైన జ్ఞానాన్ని పొందుతారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతారు.

కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు

శ్లోకం: కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసన్మూఢచేతాః । యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేయం శాధి మాన్ తరవాం॥

ఈ శ్లోకాన్ని ఉచ్చరించడం కాస్త కష్టమైనప్పటికీ దీనిలో చాలా లోతైన అర్థం ఉంది. “బలహీనత కారణంగా ప్రశాంతతను కోల్పోయాను. ఈ స్థితిలో నాకు ఏది ఉత్తమము స్పష్టంగా చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి నాకు ఉపదేశించండి” అని కృష్ణ పరమాత్ముడిని అర్జునుడు ఇలా వేడుకున్నాడు. సందేహం వచ్చినప్పుడు మీరు దేవుడిని అడగాలి అనే ఉద్దేశాన్ని ఇది బోధిస్తుంది. మనుషుల భయాందోళనలో, గందరగోళంలో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడతారు. అటువంటి సమయంలో ఎవరైనా చెయ్యి పట్టి మార్గదర్శకత్వం చేస్తే బాగుంటుందని ఆశపడతారు. అర్జునుడు తన కర్తవ్యం నైతిక సందిగ్ధతలో మునిగిపోయినప్పుడు జ్ఞానం కోసం కృష్ణుడిని ఆశ్రయించాడు. అలా మీరు కూడా మీ కన్ఫ్యూజన్ ని తొలగించుకునేందుకు భగవంతుడిని ఆశ్రయించడం మంచిదని ఇది సూచిస్తుంది.

భయంలో ఉన్నప్పుడు

శ్లోకం: వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః॥

భయం మన ఆలోచనలను కప్పివేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా చేస్తుంది. ఈ భయం కారణంగా జీవితంలో ముందుకు వెళ్లలేకపోతారు. అందువల్ల భక్తి ద్వారా భయం నుండి విముక్తి లభిస్తుందని, ఉన్నత శక్తికి ఆశ్రయించాలని ఈ శ్లోకం సలహా ఇస్తుంది. దైవంపై దృష్టి పెట్టడం ద్వారా మీ భయాలను అధిగమించవచ్చు.

దురాశను వదిలించుకునేందుకు

శ్లోకం: సత్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।

ప్రమాదమోహౌ తమసో భవతో ⁇ జ్ఞాన���ేవ చ॥

“మంచితనం నుంచి నిజమైన జ్ఞానం వస్తుంది. అభిరుచి నుంచి దురాశ వస్తుంది. అజ్ఞానం నుంచి పిచ్చి, ఊహాజనితం ఎక్కువగా ఉంటుంది” అని దీని అర్థం. ప్రాపంచిక కోరికలు, ఆనందాల నుంచి మనకు దురాశ కలుగుతుంది. ఈ దురాశను ఎదుర్కోవడానికి మనం దానికంటే పైకి ఎదగాలి. మంచితనం ద్వారా నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకే దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ విషయంలోనూ దురాశగా ఆలోచించకూడదు. అది చివరికి మనల్ని మింగేస్తుందని ఈ శ్లోకం పరమార్ధం.

నిరుత్సాహంలో కూరుకుపోయినప్పుడు

శ్లోకం: తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుక్ష్వరాజ్యం సమ్.

మయైవతే నిహత: పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్॥

ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం చేకూకపోతే చాలామంది నిరుత్సాహపడిపోతారు. ముందుకు సాగేందుకు ఉత్సాహం చూపించరు. అటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ముందడుగు వేస్తారు. శత్రువులను జయించాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఇవి మనిషికి ఒక స్ఫూర్తి ప్రేరణగా ఉంటాయి. భగవంతుడు మనకోసం ఒక ప్రణాళికను ముందే రచించి పెట్టాడని దాని ప్రకారమే జరుగుతాయని అలాంటిదే ఇది కూడా అని ఈ శ్లోకం అర్థం చెబుతోంది. ఎదురు దెబ్బలు తగిలి కింద పడినప్పటికీ విధులను మర్చిపోకుండా వాటిని పూర్తి చేయమని ప్రోత్సహించడం ఈ శ్లోకం పరమార్థం. యుద్ధాన్ని దేవుడు నడిపిస్తాడని శత్రువులు అతనిచే నాశనం చేయబడతారని పోరాటంలో మన వంతు సహకారం మనం అందించాలి. మిగతా భారం దేవుడి మీద వేయాలని ఈ శ్లోకం అర్థం.

ఆశ కోల్పోయినప్పుడు

శ్లోకం: యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్ ।

ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడు ఆశ కోల్పోకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆశ కోల్పోయారంటే ఇక వెనుకబడిపోతారు. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ప్రతిసారి అపజయమే ఎదురవుతుందని అనుకోకూడదు. ఇలాంటి సమయాల్లో ఈ శ్లోకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు తనకు లొంగిపోయే ప్రతి ఒక్కరికి వారి జీవిత అంతిమ ఫలితాలను, ప్రతిఫలం ఇస్తాడని ఈ శ్లోకం అర్థం. మన ప్రయత్నం మనం చేస్తే ప్రతిఫలం దేవుని చిత్తం అనే విధంగా ఉండాలి. అంతేకానీ మనం ఎటువంటి కృషి చేయకుండా మొత్తం దేవుడి మీద భారం వేయడం సరైన పద్ధతి కాదు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel