తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lulu Mall Inspection: కూకట్‌పల్లి లులూ మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు, నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు

Lulu Mall Inspection: కూకట్‌పల్లి లులూ మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు, నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు

Sarath chandra.B HT Telugu
Jun 28, 2024 10:09 AM IST

Lulu Mall Inspection: హైదరాబాద్‌ లులూ మాల్‌లో తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్ధాల విక్రయంతో పాటు, నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు.

కూకట్ పల్లి లులూ మాల్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు
కూకట్ పల్లి లులూ మాల్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

Lulu Mall Inspection: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులూ హైపర్‌ మార్కెట్లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్‌ బృందం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో ఆహార భద్రతా ప్రమాణాలు, నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.

బేకరీ యూనిట్ లో బ్రెడ్ మిక్స్ (10 కిలోలు), లూజ్ బ్రెడ్ మిక్స్ (15 కిలోలు) వంటి పురుగులు సోకిన వస్తువులను గుర్తించి పారవేసినట్టు ప్రకటించారు. నువ్వులు (20 కిలోలు), టోన్డ్ మిల్క్ (20 లీటర్లు), బిస్కెట్ ప్యాకెట్లు, గ్లేజ్ (7.5 కిలోలు), జెమ్స్ (5 కిలోలు), ఫ్రూట్ జ్యూస్ (2 కిలోలు) వంటి కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించామని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది.

ఈ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ సరిగా లేదని, కొంతమంది ఫుడ్ హ్యాండ్లర్లు సరైన దుస్తులు, గ్లౌజులు, ఆప్రాన్లు లేకుండా కనిపించారని గుర్తించారు.

అప్డేట్ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ లైసెన్స్ కాపీని ప్రాంగణం ప్రవేశ ద్వారం వద్ద ప్రదర్శించలేదని, ఫుడ్ విభాగంలోని కార్మికులు హెయిర్ క్యాప్ లు, గ్లౌజులు, మాస్క్ లు, యూనిఫామ్ లు లేకుండా కనిపించారని, 40 మంది ఎఫ్ వోఎస్ టీఏసీ శిక్షణ పొందిన సూపర్ వైజర్లు ఆ ప్రాంగణంలో అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.

మాంసం నిల్వ ఉంచిన ప్రదేశంతో పాటు, ఈగలు సంచరిస్తున్నట్లు గుర్తించామని, ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 'నిబంధనల ఉల్లంఘనపై లులూ హైపర్ మార్కెట్ కు నోటీసులు జారీ చేస్తామని, తనిఖీ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.

మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్ సరిగా లేదని, ఫుడ్ హ్యాండ్లర్లు హెడ్ గేర్, గ్లౌజులు, ఆప్రాన్ లు ధరించకుండా విధుల్లో ఉన్నారని, పాక్షికంగా తయారుచేసిన ఆహార పదార్థాలను, కట్ చేసిన కూరగాయలను సరిగా కవర్ చేయలేదని, వాటికి లేబుల్ వేయలేదని, వంటగది ఆవరణ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు.

ఆహార వ్యర్థాలను నేరుగా నేలపై పడేశారని, కిచెన్ ఆవరణలో పురుగులు రాకుండా ప్రూఫ్ స్క్రీన్ ను అమర్చలేదని, వంట గదిలో పురుగులు రాకుండా తలుపులు మూసి వేయలేదని తెలిపారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవని, బియ్యం పిండి (3.5 కిలోలు) గడువు ముగిసిందని గుర్తించడంతో వాటిని అక్కడికక్కడే పారేశారని ట్వీట్లో పేర్కొన్నారు.

బేకరీ యూనిట్ లో బ్రెడ్ మిక్స్ (10 కిలోలు), లూజ్ బ్రెడ్ మిక్స్ (15 కిలోలు) వంటి పురుగులు సోకిన వస్తువులను గుర్తించి పారవేసినట్టు ప్రకటించారు. నువ్వులు (20 కిలోలు), టోన్డ్ మిల్క్ (20 లీటర్లు), బిస్కెట్ ప్యాకెట్లు, గ్లేజ్ (7.5 కిలోలు), జెమ్స్ (5 కిలోలు), ఫ్రూట్ జ్యూస్ (2 కిలోలు) వంటి కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించామని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది

టీ20 వరల్డ్ కప్ 2024