తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Theme Of Kalki Lyrics: అద్భుతంగా కల్కి థీమ్ సాంగ్.. కల్కి అవతారం గురించి.. లిరిక్స్ ఇక్కడ చూడండి

Theme of Kalki Lyrics: అద్భుతంగా కల్కి థీమ్ సాంగ్.. కల్కి అవతారం గురించి.. లిరిక్స్ ఇక్కడ చూడండి

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2024 10:48 PM IST

Kalki 2898 AD - Theme of Kalki Song Lyrics: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాట వచ్చింది. కల్కి అవతారం గురించి వివరిస్తూ ఈ పాట అద్భుతంగా ఉంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

Theme of Kalki Lyrics: అద్భుతంగా కల్కి థీమ్ సాంగ్.. కల్కి అవతారం గురించి.. లిరిక్స్ ఇక్కడ చూడండి
Theme of Kalki Lyrics: అద్భుతంగా కల్కి థీమ్ సాంగ్.. కల్కి అవతారం గురించి.. లిరిక్స్ ఇక్కడ చూడండి

Kalki 2898 AD: సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మరో రెండు రోజుల్లో జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. చాలా రికార్డులను ఈ మూవీ బద్దలుకొట్టేలా కనిపిస్తోంది. భారత పురాణాల ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ కల్కి 2898 ఏడీ సైన్స్ ఫిక్షన్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. ఈ చిత్రం నుంచి నేడు (జూన్ 25) థీమ్ ఆఫ్ కల్కి సాంగ్ వచ్చ���ంది.

కల్కి అవతారాన్ని వివరించేలా..

కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి థీమ్ ఆఫ్ కల్కి పాటను మూవీ టీమ్ నేడు రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటకు మంచి ట్యూన్ ఇచ్చారు. పాటల రచయిత చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారం గురించి వివరించారు. ఈ పాటను కాలభైరవ, అనంతు, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.

‘థీమ్ ఆఫ్ కల్కి’ పాట లిరిక్స్

అధర్మాన్ని అణిచేయ్యగ

యుగయుగాన.. జగములోన

పరిపరి విధాల్లోన విభవించే.. విక్రమ విరాట్రూపమితడే

స్వధర్మాన్ని పరిరక్షించగ

సమస్తాన్ని ప్రక్షాళించగ

సముద్భవించే అవతారమిదే..

మీనమై.. పిదప కూర్మమై

తను వరాహమై.. మనకు సాయమై

బాణమై.. కరకు ఖడ్గమై

చురుకు ఘూతమై.. మనకు ఊతమై

నిశి తొలిచాడు దీపమై

నిధనం తన ధ్యేయమై

వాయువే.. వేగమై

కలియుగ స్థితిలయలే కలబోసే కల్కి ఇతడే

స్వధర్మాన్ని పరిరక్షించగ

సమస్తాన్ని ప్రక్షాళించగ

సముద్భవించే అవతారమిదే..

ప్రార్థనో.. మధుర కీర్తనో

హృదయ వేదనో.. మన నివేదనం

అందితే.. మనవి తక్షణం

మనకు సంభవం.. అతడి వైభవం

అధర్మాన్ని అణిచేయ్యగ

యుగయుగాన జగములోన

పరిపరి విధాల్లోన.. విభవించే విక్రమ విరాట్రూపమితడే

స్వధార్మాన్ని పరిరక్షించగ

సమస్తాన్ని ప్రక్షాళించగ

సముద్భవించే అవతారమిదే

ఫస్ట్ డే భారీ వసూళ్లు పక్కా

కల్కి 2898 ఏడీ సినిమాకు తొలి రోజు భారీ ఓపెనింగ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. బుకింగ్ ట్రెండ్ చూస్తే ఇది అర్థమవుతోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.200కోట్లకుపైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. తొలి రోజు రూ.223 కోట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 (రూ.214) ఉంది. వీటిని కల్కి 2898 ఏడీ దాటుంతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, సస్వస్త ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. అద్భుతమైన విజువల్స్‌తో ఫ్యుచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీ20 వరల్డ్ కప్ 2024