తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Comedy Movie Ott: నేరుగా ఓటీటీలోకి వస్తున్న సోనాక్షి సిన్హా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Horror Comedy Movie OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న సోనాక్షి సిన్హా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2024 05:08 PM IST

Kakuda OTT Release Date: హారర్ కామెడీ మూవీ కకుడా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

OTT Horror Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న సోనాక్షి సిన్హా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Horror Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న సోనాక్షి సిన్హా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాజాగా వివాహం చేసుకున్నారు. సినీ రచయిత జహీర్ అబ్బాస్‍ను ఆమె పెళ్లాడారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ముంబైలో ఆదివారం (జూన్ 23) సోనాక్షి - జహీర్ పెళ్లి జరిగింది. వివాహం తర్వాత సోనాక్షి నుంచి రానున్న మూవీగా ‘కకుడా’ ఉండనుంది. ఈ మూవీలో రితేశ్ దేశ్‍ముఖ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ హారర్ కామెడీ మూవీకి ఆదిత్య సర్పోర్ట్‌దార్ దర్శకత్వం వహించారు. కకుడా మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది.

ఓటీటీ రిలీజ్ డేట్

కకుడా సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. జూలై 12న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

కకుడా చిత్రంలో రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ మూవీలో ప్రదాన పాత్రలు పోషించారు. ఓ గ్రామంలో జరిగే స్టోరీతో హారర్ ఎలిమెంట్లతో కామెడీ కూడా మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. కామెడీ టైమింగ్‍తో మెప్పించగల ముగ్గురు ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆసిఫ్ ఖాన్, సచిన్ విద్రోహి, అరుణ్ దూబే, సూరజ్ రాజ్ మధ్వానీ కీలకపాత్రలు పోషించారు.

కకుడా స్టోరీలైన్

ఉత్తర ప్రదేశ్ మథుర జిల్లాలోని రాటోడీ అనే గ్రామంలో కకుడా మూవీ స్టోరీ సాగుతుంది. ఆ గ్రామంలో చూసేందుకు ఇళ్లు అన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతీ ఇంటికి ఒక సాధారణ తలుపుతో పాటు మరొక చిన్న తలుపు కూడా ఉంటుంది. సంప్రదాయంలో భాగంగా ప్రతీ రోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు అన్ని ఇళ్లలోని వారు చిన్న తలుపును తెరవాల్సిందే. ఎవరైనా అలా చేయకపోతే.. వారి ఇంట్లోని పురుషుడిని కకుడా వచ్చి చంపేస్తుందని నమ్ముతారు. ఈ స్టోరీ చుట్టే ఈ చిత్రం నడుస్తుంది. జూలై 12న ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

కకుడా మూవీకి అవినాశ్ ద్వివేది, చిరాగ్ గార్క్ కథ అందించగా.. ఆదిత్య దర్శకత్వం వహించారు. ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మించారు. మరి ఈ హిందీ మూవీ ఇతర భాషల్లోనూ డబ్బింగ్‍లో వస్తుందా అనేది చూడాలి.

సోనాక్షి వివాహం

సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్ వివాహం ఆదివారం జరిగింది. ముందుగా ముంబైలోని నివాసంలో వీరి పెళ్లి జరిగింది. సోనాక్షి వైట్ చీర ధరిస్తే.. జహీర్ వైట్ షేర్వాణీ వేసుకున్నారు. ఏడు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని, ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యామని సోనాక్షి సిన్హా ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఆ తర్వాత సెలెబ్రిటీలకు వారిద్దరూ ఓ రెస్టారెంట్‍లో రిసెప్షన్ ఇచ్చారు. అయితే, వీరి మతాలు వేరు కావడంతో సోషల్ మీడియాలో కొంత నెగెటివిటీ వచ్చింది. “ఇరు కుటుంబాలు.. ఇద్దరు దేవుళ్లు ఆశీర్వాదంతో తమ పెళ్లి జరిగింది” అని పోస్ట్ చేసి సోనాక్షి బదులిచ్చారు. కాగా, ఈ వివాహానికి తొలుత సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఓకే చెప్పారని టాక్ ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024