తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Eng Vs Usa: సెమీస్ చేరిన ఇంగ్లండ్.. హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన జోర్డాన్.. బట్లర్ చితకబాదుడు

ENG vs USA: సెమీస్ చేరిన ఇంగ్లండ్.. హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన జోర్డాన్.. బట్లర్ చితకబాదుడు

Jun 23, 2024, 11:22 PM IST Chatakonda Krishna Prakash
Jun 23, 2024, 11:22 PM , IST

  • ENG vs USA T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ సెమీఫైనల్‍కు దూసుకెళ్లింది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్. అమెరికాపై నేడు (జూన్ 23) సూపర్-8 మ్యాచ్‍లో భారీగా గెలిచి సెమీస్ చేరింది ఇంగ్లిష్ జట్టు. 

టీ20 ప్రపంచకప్ 2024లో మెగాటోర్నీ సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా నేడు (జూన్ 23) జరిగిన గ్రూప్-2 సూపర్ 8 మ్యాచ్‍లో అమెరికాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 62 బంతులు మిగిల్చి విజయం సాధించింది. 

(1 / 6)

టీ20 ప్రపంచకప్ 2024లో మెగాటోర్నీ సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా నేడు (జూన్ 23) జరిగిన గ్రూప్-2 సూపర్ 8 మ్యాచ్‍లో అమెరికాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 62 బంతులు మిగిల్చి విజయం సాధించింది. (PTI)

సూపర్ 8 గ్రూప్-2లో మూడు మ్యాచ్‍‍ల్లో రెండు గెలిచిన ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరింది. మూడింట మూడు ఓడిన అమెరికా టోర్నీ నుంచి ఔట్ అయింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. 

(2 / 6)

సూపర్ 8 గ్రూప్-2లో మూడు మ్యాచ్‍‍ల్లో రెండు గెలిచిన ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరింది. మూడింట మూడు ఓడిన అమెరికా టోర్నీ నుంచి ఔట్ అయింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. (AP)

ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ 19వ ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. అందులో హ్యాట్రిక్ కూడా ఉంది. 19వ ఓవర్ తొలి బంతికి అమెరికా బ్యాటర్ కోరీ ఆండర్సన్‍ను జోర్డాన్ ఔట్ చేశాడు. రెండో బంతి డాట్ పడింది. ఆ తర్వాత అలీఖాన్, కెంజిగే, నేత్రవల్కర్‌ను వరుసగా మూడు, నాలుగు, ఐదు బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు జోర్డాన్. ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ (2021) తర్వాత టీ20 ప్రపంచకప్‍ల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా జోర్డాన్ రికార్డులకెక్కాడు. జోర్డాన్ విజృంభణతో 115 పరుగులకే అమెరికా కుప్పకూలింది. ఆదిల్ రషీద్, సామ్ కరన్ తలా రెండు వికెట్లు తీశారు. 

(3 / 6)

ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ 19వ ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. అందులో హ్యాట్రిక్ కూడా ఉంది. 19వ ఓవర్ తొలి బంతికి అమెరికా బ్యాటర్ కోరీ ఆండర్సన్‍ను జోర్డాన్ ఔట్ చేశాడు. రెండో బంతి డాట్ పడింది. ఆ తర్వాత అలీఖాన్, కెంజిగే, నేత్రవల్కర్‌ను వరుసగా మూడు, నాలుగు, ఐదు బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు జోర్డాన్. ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ (2021) తర్వాత టీ20 ప్రపంచకప్‍ల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా జోర్డాన్ రికార్డులకెక్కాడు. జోర్డాన్ విజృంభణతో 115 పరుగులకే అమెరికా కుప్పకూలింది. ఆదిల్ రషీద్, సామ్ కరన్ తలా రెండు వికెట్లు తీశారు. (AP)

స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది ఇంగ్లండ్. 9.4 ఓవర్లలోనే 117 రన్స్ చేసి గెలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 38 బంతుల్లోనే అజేయంగా 83 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శకతం చేశాడు. ఏకంగా 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో అమెరికా బౌలర్లను బట్లర్ చితకబాదాడు. ఫిల్ సాల్ట్ (25 నాటౌట్) తోడుగా నిలిచాడు. 

(4 / 6)

స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది ఇంగ్లండ్. 9.4 ఓవర్లలోనే 117 రన్స్ చేసి గెలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 38 బంతుల్లోనే అజేయంగా 83 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శకతం చేశాడు. ఏకంగా 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో అమెరికా బౌలర్లను బట్లర్ చితకబాదాడు. ఫిల్ సాల్ట్ (25 నాటౌట్) తోడుగా నిలిచాడు. (PTI)

సూపర్ 8 గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య రేపు (జూన్ 24) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. ఓడిన టీమ్ ఇంటికి వెళుతుంది. 

(5 / 6)

సూపర్ 8 గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య రేపు (జూన్ 24) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. ఓడిన టీమ్ ఇంటికి వెళుతుంది. (AFP)

సూపర్ 8 గ్రూప్-1లో రేపు (జూన్ 24) భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిస్తే టీమిండియా సెమీస్ చేరుతుంది. ఒకవేళ టీమిండియా ఓడితే.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‍పై సెమీస్ అర్హతలు ఆధారపడతాయి. 

(6 / 6)

సూపర్ 8 గ్రూప్-1లో రేపు (జూన్ 24) భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిస్తే టీమిండియా సెమీస్ చేరుతుంది. ఒకవేళ టీమిండియా ఓడితే.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‍పై సెమీస్ అర్హతలు ఆధారపడతాయి. (AFP)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు