తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  India Vs Australia: ఆస్ట్రేలియాను కంగారెత్తించిన టీమిండియా.. రోహిత్ నుంచి కుల్దీప్ వరకు.. ఫొటోలు

India vs Australia: ఆస్ట్రేలియాను కంగారెత్తించిన టీమిండియా.. రోహిత్ నుంచి కుల్దీప్ వరకు.. ఫొటోలు

Jun 25, 2024, 06:44 AM IST Hari Prasad S
Jun 25, 2024, 06:44 AM , IST

  • India vs Australia: ఆస్ట్రేలియాను కంగారెత్తించింది టీమిండియా. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. ఆ టీమ్ ను చివరి సూపర్ 8 మ్యాచ్ లో ఓడించి సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది.

India vs Australia: ఆస్ట్రేలియాను మొదట రోహిత్ శర్మ తన సిక్స్ లతో కంగారెత్తిస్తే.. తర్వాత కుల్దీప్, బుమ్రా, అక్షర్ పటేల్ లాంటి వాళ్లు బౌలింగ్ తో కంగారెత్తించారు. మొత్తంగా 24 పరుగులతో సులువుగా గెలిచి సెమీస్ చేరింది టీమిండియా.

(1 / 8)

India vs Australia: ఆస్ట్రేలియాను మొదట రోహిత్ శర్మ తన సిక్స్ లతో కంగారెత్తిస్తే.. తర్వాత కుల్దీప్, బుమ్రా, అక్షర్ పటేల్ లాంటి వాళ్లు బౌలింగ్ తో కంగారెత్తించారు. మొత్తంగా 24 పరుగులతో సులువుగా గెలిచి సెమీస్ చేరింది టీమిండియా.(PTI)

India vs Australia: రోహిత్ శర్మ కేవలం 41 బంతుల్లోనే 92 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో అంతగా ఫామ్ లో కనిపించని హిట్ మ్యాన్ మళ్లీ పాత రోహిత్ ను గుర్తు చేస్తూ 8 సిక్సర్లు బాదాడు. దీంతో తొలి 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ పై సగం ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది.

(2 / 8)

India vs Australia: రోహిత్ శర్మ కేవలం 41 బంతుల్లోనే 92 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో అంతగా ఫామ్ లో కనిపించని హిట్ మ్యాన్ మళ్లీ పాత రోహిత్ ను గుర్తు చేస్తూ 8 సిక్సర్లు బాదాడు. దీంతో తొలి 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ పై సగం ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది.(AP)

India vs Australia:  ఈ మ్యాచ్ లో 19 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి తనను ప్రతి మ్యాచ్ లో ఇబ్బంది పెట్టే స్టార్క్ బౌలింగ్ లోనే ఔటైనా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అతన్ని వీర బాదుడు బాదాడు. ఏకంగా నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టడం విశేషం. మొత్తంగా రోహిత్ చాలా కసిగా ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదినట్లు అతని ఇన్నింగ్స్ చూస్తే స్పష్టమవుతోంది.

(3 / 8)

India vs Australia:  ఈ మ్యాచ్ లో 19 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి తనను ప్రతి మ్యాచ్ లో ఇబ్బంది పెట్టే స్టార్క్ బౌలింగ్ లోనే ఔటైనా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అతన్ని వీర బాదుడు బాదాడు. ఏకంగా నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టడం విశేషం. మొత్తంగా రోహిత్ చాలా కసిగా ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదినట్లు అతని ఇన్నింగ్స్ చూస్తే స్పష్టమవుతోంది.(AP)

India vs Australia: 206 పరుగుల చేజింగ్ లోనూ తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ లాంటి డేంజరస్ బ్యాటర్ ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ మంచి స్టార్ట్ అందించాడు.

(4 / 8)

India vs Australia: 206 పరుగుల చేజింగ్ లోనూ తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ లాంటి డేంజరస్ బ్యాటర్ ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ మంచి స్టార్ట్ అందించాడు.(ANI)

India vs Australia: అయితే రెండో వికెట్ కు ట్రావిస్ హెడ్, మార్ష్ జోడీ వేగంగా 81 పరుగులు జోడించడంతో కాస్త ఆందోళన కలిగింది. ముఖ్యంగా హెడ్ చెలరేగడం గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో అతడు చేసిన సెంచరీని గుర్తు చేసింది.

(5 / 8)

India vs Australia: అయితే రెండో వికెట్ కు ట్రావిస్ హెడ్, మార్ష్ జోడీ వేగంగా 81 పరుగులు జోడించడంతో కాస్త ఆందోళన కలిగింది. ముఖ్యంగా హెడ్ చెలరేగడం గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో అతడు చేసిన సెంచరీని గుర్తు చేసింది.(ANI)

India vs Australia: మార్ష్ ను కుల్దీప్ ఔట్ చేశాడు. బౌండరీ దగ్గర అక్షర్ పట్టిన సెన్సేషనల్ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. తర్వాత కూడా మ్యాక్స్‌వెల్, హెడ్ వేగంగా ఆడుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.

(6 / 8)

India vs Australia: మార్ష్ ను కుల్దీప్ ఔట్ చేశాడు. బౌండరీ దగ్గర అక్షర్ పట్టిన సెన్సేషనల్ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. తర్వాత కూడా మ్యాక్స్‌వెల్, హెడ్ వేగంగా ఆడుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.(AP)

India vs Australia: హెడ్ 43 బాల్స్ లోనే 76 రన్స్ చేశాడు. అతడు ఉన్నంతసేపు మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోనే ఉన్నట్లు కనిపించింది. అతడు 9 ఫోర్లు, 4 సిక్స్ లు కొట్టాడు.

(7 / 8)

India vs Australia: హెడ్ 43 బాల్స్ లోనే 76 రన్స్ చేశాడు. అతడు ఉన్నంతసేపు మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోనే ఉన్నట్లు కనిపించింది. అతడు 9 ఫోర్లు, 4 సిక్స్ లు కొట్టాడు.(AP)

India vs Australia: ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వచ్చిన బుమ్రా.. హెడ్ ను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక అక్కడి నుంచి ఆ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 24 పరుగులతో ఓడిపోయింది.

(8 / 8)

India vs Australia: ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వచ్చిన బుమ్రా.. హెడ్ ను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక అక్కడి నుంచి ఆ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 24 పరుగులతో ఓడిపోయింది.(PTI)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు