తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pune Porsche Accident : ‘పూణె పోర్షే కేసు నిందితుడిని వెంటనే విడుదల చేయండి’- బాంబే హైకోర్టు

Pune Porsche accident : ‘పూణె పోర్షే కేసు నిందితుడిని వెంటనే విడుదల చేయండి’- బాంబే హైకోర్టు

Sharath Chitturi HT Telugu
Jun 25, 2024 05:06 PM IST

Pune Porsche case accused released : పూణె పోర్షే కేసు నిందితుడిని విడిచిపెట్టాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఫలితంగా.. అతను అబ్జర్వేషన్​ హోమ్​ నుంచి విడుదలకానున్నాడు.

ప్రమాదానికి కారణమైన పూణే పోర్షే కారు..
ప్రమాదానికి కారణమైన పూణే పోర్షే కారు.. (HT_PRINT)

Pune porsche case update : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె పోర్షే కేసు నిందితుడిని.. అబ్జర్వేషన్​ హోమ్​ నుంచి వెంటనే విడుదల చేయాలని మంగళవారంం ఆదేశాలిచ్చింది బాంబే హైకోర్టు. మద్యం మత్తులో పోర్షే కారును నడుపుతూ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఇద్దరు మరణానికి ఆ నిందితుడు కారణమన్న విషయం తెలిసిందే.

పూణె పోర్షే ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడిని అబ్జర్వేషన్ హోమ్​లో రిమాండ్ చేస్తూ జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) జారీ చేసిన ఉత్తర్వులను.. జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్​పాండేలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కొట్టివేసింది.

బాలుడి మేనత్త దాఖలు చేసిన పిటిషన్​ను అనుమతిస్తూ.. అతడిని విడుదలకు ఆదేశిస్తున్నాం. సీసీఎల్ (చైల్డ్ ఇన్​ కాన్​ఫ్లిక్ట్​ విత్ లా).. పిటిషనర్ (మేనత్త) సంరక్షణలో ఉంటాడు,' అని కోర్టు పేర్కొంది.

జువనైల్​ జస్టిస్​ బోర్డు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, అధికార పరిధి లేకుండా జారీ చేశారని ధర్మాసనం పేర్కొంది. ప్రమాదంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనల మధ్య సీసీఎల్​ వయస్సును పరిగణలోకి తీసుకోలేదని కోర్టు తెలిపింది.

'సీసీఎల్ వయసు 18 ఏళ్ల లోపు ఉంది. అతని వయసును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది," అని బాంబే హైకోర్టు తెలిపింది.

కోర్టు చట్టాలకు జువనైల్​ జస్టిస్​ చట్టం ఆబ్జెక్టివ్స్​కి కట్టుబడి ఉందని, కానీ.. నేర తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ నిందితుడిని అడల్ట్​గా కాకుండా.. ఒక సీసీఎల్​గానే పరిగణిస్తామని బాంబే హైకోర్టు వివరించింది.

'సీసీఎల్​లను భిన్నంగా పరిగణించాలి' అని హైకోర్టు పేర్కొంది.

17ఏళ్ల బాలుడిని అక్రమంగా నిర్బంధించారని, వెంటనే విడుదల చేయాలని కోరుతూ అతని మేనత్త దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన అనంతరం బాంబే హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ అజెండాతో పాటు ప్రజల ఆగ్రహావేశాల కారణంగా మైనర్ బాలుడి విషయంలో పోలీసులు సరైన దర్యాప్తు నుంచి పక్కదారి పట్టారని, తద్వారా జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, సంరక్షణ) చట్టం మొత్తం ఉద్దేశ్యాన్ని దెబ్బతీశారని బాలుడి మేనత్త తన పిటిషన్​లో వాదించారు.

మైనర్ నిందితుడి తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ.. "జువైనల్ జస్టిస్ బోర్డు మూడు రిమాండ్లను ఈ రోజు హైకోర్టులో సవాలు చేశాం. అతడిని విడుదల చేయాలని మేం వాదించాం.  ఈ రోజు విడుదలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేనత్తకు కస్టడీ దక్కింది," అని అన్నారు.

మే 19న జరిగిన పూణె పోర్షే ప్రమాదంలో మధ్యప్రదేశ్​కి చెందిన ఇద్దరు టెకీలు మరణించారు. ఈ ఘటనలో నిందితుడు.. ఒక మైనర్​ అని, మద్యం తాగిన మత్తులో బండి నడిపి యాక్సిడెంట్​ చేశాడని తేలడంతో.. దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. నేరస్థుడికి మొదట బలహీనమైన కారణాలతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కాని బెయిల్ ఉత్తర్వులను సవరించాలని పోలీసుల అభ్యర్థన మేరకు మే 22 న జువైనల్ జస్టిస్ బోర్డు అబ్జర్వేషన్ హోమ్​కు రిమాండ్ చేసింది.

మే 22న బాలుడిని అదుపులోకి తీసుకుని అబ్జర్వేషన్ హోంకు తరలించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం